పదవ తరగతి అర్హతతో MTS ఉద్యోగాలు! CSIR – CDRI Notification 2026 విడుదల

CSIR – CDRI Notification 2026

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ (CDRI), లక్నో నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ CSIR – CDRI Notification 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఈ CSIR – CDRI Notification 2026 ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) మరియు హిందీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ కోసం ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు.

ఈ CSIR – CDRI Notification 2026 కోసం అభ్యర్థులు జనవరి 12, 2026 వ తేదీ నుండి ఫిబ్రవరి 16, 2026 వ తేదీ లోగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఈ CSIR – CDRI Notification 2026 ద్వారా

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) – 4 (UR-2, SC-1, OBC-1) పోస్టులను

హిందీ ఆఫీసర్ – 1 (UR)

మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 5 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

పదవ తరగతి అర్హతతో రైల్వేలో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.

Age Limit:

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): 18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

హిందీ ఆఫీసర్: 35 సంవత్సరముల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన ఉంది.

ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్స్యేషన్ ఉంది.

Educational Qualification:

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): పదవ తరగతి పాస్ అయి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

లేదా

ఐటిఐ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

హిందీ ఆఫీసర్: క్వాలిఫికేషన్ వివరాలు అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

Selection Process:

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): ముందుగా అభ్యర్థులకు ట్రేడ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ట్రేడ్ టెస్ట్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులను కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కి పిలవడం జరుగుతుంది.

కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్(CWE):

సబ్జెక్టుప్రశ్నలుమార్కులు
జనరల్ ఇంటెలిజెన్స్2575
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్2575
జనరల్ అవేర్నెస్50150
ఇంగ్లీష్ లాంగ్వేజ్50150

ఈ పరీక్షను 150 ప్రశ్నలకు గాను 2 గంటల పాటు నిర్వహించడం జరుగుతుంది. పరీక్ష పేపర్ ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. పరీక్ష 10వ తరగతి స్టాండర్డ్ లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు నెగిటివ్ ఉంది.

హిందీ ఆఫీసర్: రిటన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూను నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

How To Apply:

ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు https://cdri.res.in వెబ్సైటులో జనవరి 10, 2026వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి 16, 2026వ తేదీ సాయంత్రం 5:30 లోపు అప్లై చేసుకోవాలి.

Application Fee:

ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

మహిళలు, ఎస్సీ, ఎస్టి, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Salary:

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): ఈ ఉద్యోగాలు గ్రూప్ సి లెవెల్ 1 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకు బేసిక్ పే Rs. 18000-56900/- రూపాయల మధ్య ఉంటుంది. ఇంకా అదనంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అన్ని కలుపుకొని నెలకు 35,393/- రూపాయల జీతం వస్తుంది.

హిందీ ఆఫీసర్: ఈ ఉద్యోగాలు గ్రూప్ ఏ (గజిటెడ్) లెవెల్ 10 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే బేసిక్ పే Rs. 56100-177500/-రూపాయల మధ్య జీతం ఉంటుంది. అన్ని కలుపుకొని నెలకు 97,452/-రూపాయల జీతం వస్తుంది.

Note: ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు లక్నోలో ఎగ్జామ్ ఉంటుంది.

Notification

Official Website: https://cdri.res.in

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

WhatsApp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment