CSIR – CMERI Recruitment 2026 In Telugu: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

CSIR – CMERI Recruitment 2026 In Telugu:

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) కింద పని చేస్తున్నటువంటి సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ (CMERI), Durgapur నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ CSIR – CMERI Recruitment 2026 In Telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఈ CSIR – CMERI Recruitment 2026 ద్వారా టెక్నీషియన్-I ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

పోస్ట్ పేరుఖాళీల సంఖ్య
ఫిట్టర్ 8
ఎలక్ట్రీషియన్/మెకానిక్(ఎలక్ట్రికల్ పవర్ డ్రైవ్స్)5
ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ఇన్స్ట్రుమెంట్ మెకానిక్6
డిజిటల్ ఫోటోగ్రఫీ1
మొత్తం20 పోస్టులు

ఈ CSIR – CMERI Recruitment 2026 ద్వారా 20 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. కేటగిరి వైజ్ పోస్టులను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

పదవ తరగతి అర్హతతో రైల్వేలో 22000 సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.

ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు డిసెంబర్ 22, 2025 వ తేదీ నుండి జనవరి 21, 2026వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

Age Limit:

18 సంవత్సరముల నుండి 28 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో అన్ రిజర్వుడు అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

Educational Qualification:

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 55% మార్కులతో పదవ తరగతి పాసై ఉండాలి. అలాగే రెలవెంట్ ట్రేడ్ లో ఐటిఐ చేసి ఉండాలి.

లేదా

55% మార్కులతో పదవ తరగతి పాసై ఉండాలి. అలాగే 2 సంవత్సరముల అప్రెంటిస్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.

లేదా

55% మార్కులతో పదవ తరగతి పాసై ఉండాలి. అలాగే 3 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.

Selection Process:

ట్రేడ్ టెస్టు మరియు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

ట్రేడ్ టెస్ట్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులను కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కి పిలవడం జరుగుతుంది.

కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది 150 ప్రశ్నలకు గాను 2 గంటల 30 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో వస్తుంది. XIIth స్టాండర్డ్ లెవెల్లో ఎగ్జామ్ ఉంటుంది.

సిలబస్ మరియు పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

How To Apply:

ఈ CSIR – CMERI Recruitment 2026 కోసం అభ్యర్థులు http://www.cmeri.res.in వెబ్సైటులో డిసెంబర్ 22వ తేదీ నుండి జనవరి 21, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

అభ్యర్థులు వ్యాలీడ్ ఈ మెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్ తో మాత్రమే అప్లై చేసుకోండి.

Application Fee:

ఈ CSIR – CMERI Recruitment 2026 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Salary:

ఈ ఉద్యోగాలు Level – 2 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకి 19,900 రూపాయల నుండి 63,200 రూపాయల మధ్య జీతం ఉంటుంది. అన్ని కలుపుకొని నెలకు 37,000 రూపాయల జీతం వస్తుంది.

Notification

Official Website: https://www.cmeri.res.in/

Leave a Comment