CSIR – NML Recruitment 2026 In Telugu
పదవ తరగతి అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ కోసం మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ CSIR – NML Recruitment 2026 In Telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) కింద పని చేస్తున్నటువంటి నేషనల్ మెటలర్జికల్ లాబరేటరీ (NML), Jamshedpur, Jharkhand నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ CSIR – NML Recruitment 2026 ద్వారా 22 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
పదవ తరగతి అర్హతతో 22,000 సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు
ఈ CSIR – NML Recruitment 2026 కోసం అభ్యర్థులు జనవరి 5, 2026 వ తేదీ నుండి ఫిబ్రవరి 6, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
Age Limit:
ఈ CSIR – NML Recruitment 2026 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసును కలిగి ఉండాలి.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
ఈ 22 పోస్టులలో
14 పోస్టులకు కేవలం పదవ తరగతి పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు.
మిగిలిన 8 పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థులు ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ఫిట్టర్, ప్లంబర్, ఎయిర్ కండిషన్ (AC) & రిఫ్రిజిరేషన్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) ట్రేడ్స్ లో ఐటిఐ చేసి ఉండాలి.
| 14 పోస్టులకి | పదవ తరగతి చదివి ఉంటే అప్లై చేసుకోవచ్చు. |
| 8 పోస్టులకి | రిలవెంట్ ట్రేడ్ లో ఐటిఐ చేసి ఉండాలి. |
Selection Process:
అప్లై చేసుకున్న వారి అప్లికేషన్స్ ను ముందుగా షార్ట్ లీస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ని కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కి పిలవడం జరుగుతుంది.
కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్
| సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు |
| జనరల్ ఇంటెలిజెన్స్ | 25 ప్రశ్నలు | 75 మార్కులు |
| క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 25 ప్రశ్నలు | 75 మార్కులు |
| జనరల్ అవేర్నెస్ | 50 ప్రశ్నలు | 150 మార్కులు |
| ఇంగ్లీష్ లాంగ్వేజ్ | 50 ప్రశ్నలు | 150 మార్కులు |
ఈ ఎగ్జామ్ అనేది 150 ప్రశ్నలకు గాను 2 గంటల పాటు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఎగ్జామ్ అనేది టెన్త్ స్టాండర్డ్ లో ఉంటుంది. పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో ఉంటుంది.
How To Apply :
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు CSIR – NML అఫీషియల్ వెబ్సైట్ అయిన https://nml.res.in లో జనవరి 5, 2026వ తేదీ ఉదయం 11 గంటల నుండి ఫిబ్రవరి 6, 2026వ తేదీ సాయంత్రం 5 గంటల మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు వ్యాలీడ్ మరియు యాక్టివ్ ఈమెయిల్ ఐడిని మాత్రమే ఇచ్చే అప్లై చేసుకోండి.
Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు,ఎస్సీ, ఎస్టి మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
salary:
ఈ ఉద్యోగాలు లెవెల్ 1 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకు 18,000 రూపాయల నుండి 56,900 రూపాయల మధ్య జీతం వస్తుంది. ఇంకా అదనంగా బెనిఫిట్స్ ఉంటాయి.
అన్ని కలుపుకొని నెలకు 36,000 రూపాయల జీతం వస్తుంది.
Official Website: https://nml.res.in
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |