ప్రతి సంవత్సరం దేశ రాజధాని అయిన ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలను టీవీల్లో లేదా మొబైల్లో చూసే ఉంటారు కదా. అయితే చాలామంది అక్కడికి వెళ్లి ప్రత్యక్షంగా చూడాలి అనుకుంటుంటారు. అక్కడికి వెళ్లి ప్రత్యక్షంగా చూడాలి అంటే ముందుగా టికెట్లను బుక్ చేసుకోవాలి. ఈ Republic Day Parade Tickets 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చినది ఆగస్టు 15, 1947. అయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినది 1950 జనపరి 26 నుండి.
కాబట్టి ప్రతి సంవత్సరం భారతదేశంలో ఆగస్టు 15ను స్వాతంత్రపు దినోత్సవంగా, జనహరి 26 ను గణతంత్ర దినోత్సవం గా జరుపుకుంటాం.
పదవ తరగతి అర్హతతో రైల్వే లో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.
అయితే ప్రతి సంవత్సరం ఢిల్లీలో జనవరి 26 న జరిగే త్రివిధ దళాల పారెడ్, సైనిక ప్రదర్శనతో పాటు రాష్ట్రాలకు చెందిన శకటాల ఊరేగింపును టీవీల్లో చూసే ఉంటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రులు, ఇతర విఐపి లు మరియు విదేశీ నాయకులు హాజరవుతూ ఉంటారు.
అయితే ఈ విన్యాసాలను అందరికీ ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది. ఈ విన్యాసాలను ప్రత్యక్షంగా చూడాలి అంటే ముందుగా టికెట్ ను బుక్ చేసుకోవాలి. చాలామంది టికెట్ రేట్లు భారీగా ఉంటాయి అనుకుంటారు. కానీ టికెట్ రేట్లు ₹20 లేదా ₹100 మాత్రమే పెట్టడం జరిగింది.
Republic Day Parade Tickets 2026
ఈ టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలి అంటే ?. టికెట్లను జనవరి 5, 2026 వ తేదీ నుండి జనవరి 14, 2026 వ తేదీల మధ్య ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో రెండింటిలో అప్లై చేసుకోవచ్చు.
ఆన్లైన్ లో www.aamantran.mod.gov.in పోర్టల్ లో జనవరి 5, 2026వ తేదీ నుండి జనవరి 14, 2026వ తేదీల మధ్య ఉదయం 9:00 నుండి అప్లై చేసుకోవచ్చు.
ఆఫ్లైన్లో ఢిల్లీలోని సేనా భవన్, శాస్త్రీ భవన్, జంతర్ మంతర్, పార్లమెంట్ హౌస్ రిసెప్షన్, రాజీవ్ చౌక్, కాశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్ ల లో అప్లై చేస్కోవచ్చు.
ఆధార్, ఓటర్, పాన్ వంటి గుర్తింపు కార్డులతో టికెట్ ను పొందాలి.
ఈ జనపరి 26, 2026 వేడుకలకు సంబంధించి టికెట్లు 2 రకాలుగా ఉన్నాయి. జనవరి 28 బీటింగ్ రీట్రీట్ రిహార్సల్: టికెట్ ధర 20 రూపాయలు. జనవరి 29 బీటింగ్ రీట్రీట్: టికెట్ ధర 100 రూపాయలు
Official Website: www.aamantran.mod.gov.in