స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి శుభవార్త. 2026 – 2027 సంవత్సరానికి గాను జాబ్ క్యాలెండర్ విడుదల అయింది. ఈ SSC Calendar 2026 In Telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా ప్రతి సంవత్సరం ఆయా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో 50,000+ పోస్టుల నుండి 1,00,000+ పోస్టుల మధ్య ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉంటారు.
ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుండి విడుదల అయ్యే నోటిఫికేషన్ లు పదవ తరగతి అర్హత నుండి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఉంటాయి. SSC విడుదల చేసే నోటిఫికేషన్ లలో ఎక్కువమంది ఎదురుచూసే నోటిఫికేషన్లు.
SSC MTS: పదవ తరగతి పాస్ అయి ఉంటే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
SSC GD: పదవ తరగతి పాస్ అయి ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
SSC CHSL: ఇంటర్ లేదా 10+2 పాస్ అయి ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
SSC CGL: డిగ్రీ పాసయి ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుండి 2026 – 2027 సంవత్సరానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల అయ్యింది. ఈ SSC Calendar 2026 In Telugu కి సంబంధించి చూద్దాం.
ఎస్ఎస్సి జిడి పరీక్ష తేదీలు 2025
SSC Calendar 2026 In Telugu
| నోటిఫికేషన్ పేరు | నోటిఫికేషన్ విడుదల | నోటిఫికేషన్ లాస్ట్ డేట్ | పరీక్షా తేదీ |
| JSA/LDC డిపార్ట్మెంటల్ | 16-మార్చి-2026 | 7-ఏప్రిల్-2026 | మే, 2026 |
| SSA/UDC డిపార్ట్మెంటల్ | 16-మార్చి-2026 | 7-ఏప్రిల్-2026 | మే, 2026 |
| ASO డిపార్ట్మెంటల్ | 16-మార్చి-2026 | 7-ఏప్రిల్-2026 | మే, 2026 |
| CGL | మార్చ్, 2026 | ఏప్రిల్, 2026 | మే – జూన్, 2026 |
| జూనియర్ ఇంజనీర్ | మార్చ్, 2026 | ఏప్రిల్, 2026 | మే – జూన్, 2026 |
| సెలక్షన్ పోస్టు, ఫేస్ XIV | మార్చి, 2026 | ఏప్రిల్, 2026 | మే – జూలై, 2026 |
| CHSL | ఏప్రిల్, 2026 | మే, 2026 | జూలై – సెప్టెంబర్, 2026 |
| స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C & D | ఏప్రిల్, 2026 | మే, 2026 | ఆగస్టు – సెప్టెంబర్, 2026 |
| కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ | ఏప్రిల్, 2026 | మే, 2026 | ఆగస్టు – సెప్టెంబర్, 2026 |
| మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)& హవాల్దార్ | జూన్, 2026 | జూలై, 2026 | సెప్టెంబర్ – నవంబర్, 2026 |
| సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ & సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్ | మే, 2026 | జూన్, 2026 | అక్టోబర్ – నవంబర్, 2026 |
| కానిస్టేబుల్ జిడి | సెప్టెంబర్, 2026 | అక్టోబర్, 2026 | జనవరి – మార్చ్, 2027 |
ఈ SSC Calendar 2026 అనేది టెన్టేటివ్ డేట్స్. నోటిఫికేషన్ తేదీలు మరియు పరీక్షా తేదీలు కొంచెం అటూ ఇటూ మార్పు ఉండొచ్చు.
Official Website: https://ssc.gov.in/
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
2 thoughts on “SSC Calendar 2026 In Telugu: 60,000+ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు”