SSC GD Notification 2026 In Telugu: పదవ తరగతి అర్హతతో 25487 ఉద్యోగాలు

SSC GD Notification 2026 In Telugu:

SSC (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) నుండి పదవ తరగతి చదివిన అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా 25487 పోస్టులతో SSC GD Notification 2026 విడుదల అయింది. ఈ SSC GD Notification 2026 in telugu కు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు కేవలం పదవ తరగతి చదివి ఉంటే సరిపోతుంది.

SSC GD Notification 2025 ద్వారా BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని కలుపుకొని 25487 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

ForceMaleFemaleTotal
BSF52492616
CISF13135146014595
CRPF53661245490
SSB176401764
ITBP10991941293
AR15561501706
SSF23023
Total23467202025487

SSC GD Notification 2026 ద్వారా పురుషులకు 23467 పోస్టులను, మహిళలకు 2020 పోస్టులను మొత్తంగా 25487 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.

పదవ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు


SSC GD Notification 2026 కోసం అభ్యర్థులు డిసెంబర్ 01, 2025 వ తేదీ నుండి డిసెంబర్ 31, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ జనవరి 01, 2026.

అప్లికేషన్లో ఏవైనా తప్పులు ఉంటే జనవరి 08, 2026వ తేదీ నుండి జనవరి 10, 2026 వ తేదీ మధ్య కరెక్ట్ చేసుకోవాలి.

ఈ SSC GD Notification 2026 కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ను ఫిబ్రవరి 2026 – ఏప్రిల్ 2026 తేదీల మధ్య నిర్వహిస్తారు.

Eligibility:

Educational Qualification: జనవరి 01, 2026 వ తేదీ నాటికి పదవ తరగతి పాసైన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

Age Limit: జనవరి 01, 2026 వ తేదీ నాటికి 18 సంవత్సరముల నుండి 23 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
(అంటే అభ్యర్థులు జనవరి 02, 2003 వ తేదీ నుండి జనవరి 01, 2008 వ తేదీల మధ్య పుట్టి ఉండాలి.)

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

Selection Process:

  1. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్
  2. PET/PST
  3. మెడికల్ ఎగ్జామినేషన్/ డాక్యుమెంట్ వెరిఫికేషన్

NCC సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు వారి సర్టిఫికెట్ నీ బట్టి మార్కులు Add అవుతాయి.

  1. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్

    ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది 80 ప్రశ్నలకు గాను ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు చొప్పున 160 మార్కుల చొప్పున 60 నిమిషాల పాటు ఎగ్జామ్ ఉంటుంది.
    ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది తెలుగులో కూడా పేపర్ ఉంటుంది.
    ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది.
    ఎగ్జామ్ కు సంబంధించి పూర్తి సిలబస్ ను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

ఎగ్జామినేషన్ సెంటర్ తమకు దగ్గరలోనే పడుతుంది.

2.1 PET(ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్):

Race:

Male: 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషం లలో కంప్లీట్ చేయాలి.
అలాగే 1.6 కిలోమీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి.

Female: 1.6 కీలోమీటర్ల దూరాన్ని 8 1/2 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి.
అలాగే 800 మీటర్లను 5 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి.

2.2 PST(ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్):

Height:

Male: 170 CM

Female: 157 CM

Chest:

Male: 80 CM (ఎక్స్పెన్షన్ చేస్తే 85 సెంటీమీటర్లు రావాలి.)

ఎస్టీ అభ్యర్థులకు హైట్ అండ్ చేస్ట్ రిలాక్సేషన్ ఉంది.

Weight:

హైటును బట్టి వెయిట్ను తీసుకోవడం జరుగుతుంది.


How To Apply :

ఈ SSC GD Notification 2026 నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు https://ssc.gov.in వెబ్సైట్ లో డిసెంబర్ 31, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.

ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగ్ ఇన్ అయి అప్లై చేసుకోవాలి.

Application Fee:

ఈ SSC GD Notification 2026 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 100 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ జనవరి 01, 2026.

Notification PDF

Official Website: https://ssc.gov.in

SSC GD Notification 2026 apply last date?

SSC GD Notification 2026 apply last date December 31, 2026

SSC GD Notification 2026 ఫీజు చెల్లించడానికి లాస్ట్ డేట్?

ఎస్ఎస్సి జిడి నోటిఫికేషన్ కి ఫీజు చెల్లించడంకి చివరి తేదీ జనవరి 1, 2026.

SSC GD Notification 2026 ద్వారా ఎన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు?

SSC GD Notification 2026 ద్వారా 25487 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.

SSC GD Notification 2026 క్వాలిఫికేషన్ ఏమిటి?

పదవ తరగతి పాస్ అయి ఉంటే ఈ SSC GD Notification 2026 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.