Stock Market Holidays 2026: ఇండియా స్టాక్ మార్కెట్ సెలవుల జాబితా

Stock Market Holidays 2026

భారతదేశం ప్రధాన స్టాక్ ఎక్సేంజ్ లు అయిన NSE (నేషనల్ స్టాక్ ఎక్సేంజ్), BSE (బాంబే స్టాక్ ఎక్స్చేంజ్) లు నూతన సంవత్సరం 2026 కి సంబంధించి సెలవుల జాబితాను విడుదల చేశాయి. ఈ Stock Market Holidays 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

పండుగ లు మరియు ఇతర ప్రధాన రోజుల సందర్భంగా 2026 సంవత్సరానికి గాను స్టాక్ మార్కెట్ కి 15 రోజులు సెలవులు. సెలవు దినాల్లో ఈక్విటీ ట్రేడింగ్, డెరివేటివ్స్, సెక్యూరిటీ కార్యకలాపాలు నిలిచిపోతాయి.

అయితే శనివారం, ఆదివారాల్లో స్టాక్ మార్కెట్ కి సాధారణంగానే సెలవు ఉంటుంది.

బ్యాంకులకు అయితే ప్రాంతాల వారీగా సెలవులు మారుతూ ఉంటాయి. స్టాక్ మార్కెట్ కి మాత్రం దేశమంతటా ఒకేసారి సెలవు ఉంటుంది.

పదవ తరగతి అర్హతతో రైల్వేలో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.

Stock Market Holidays 2026 జాబితా

సంఖ్యసెలవు తేదీ
1జనవరి 26, 2026 (సోమవారం) గణతంత్ర దినోత్సవం
2మార్చి 3, 2026 (మంగళవారం) హోలీ
3మార్చి 26, 2026 (గురువారం) శ్రీరామనవమి
4మార్చి 31, 2026 (మంగళవారం) మహావీర్ జయంతి
5ఏప్రిల్ 3, 2026 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే
6ఏప్రిల్ 14, 2026 (మంగళవారం) డా. బిఆర్ అంబేద్కర్ జయంతి
7మే 1, 2026 (శుక్రవారం) మహారాష్ట్ర డే
828 మే 2026(గురువారం) బక్రీద్
926 జూన్ 2026(శుక్రవారం) మొహరం
1014 సెప్టెంబర్ 2026(సోమవారం) గణేష్ చతుర్థి
112 అక్టోబర్ 2026(శుక్రవారం) గాంధీ జయంతి
1220 అక్టోబర్ 2026(మంగళవారం) దసరా
1310 నవంబర్ 2026(మంగళవారం) దీపావళి
1424 నవంబర్ 2026(మంగళవారం) గురునానక్ జయంతి
1525 డిసెంబర్ 2026(శుక్రవారం) క్రిస్మస్

అయితే కొన్ని పండుగలు శనివారం మరియు ఆదివారంలో రావడం జరిగింది.

  • మహాశివరాత్రి – ఫిబ్రవరి 15, 2026 (ఆదివారం)
  • రంజాన్ – మార్చి 21, 2026 (శనివారం)
  • స్వాతంత్ర దినోత్సవం – ఆగస్టు 15, 2026 (శనివారం)
  • దీపావళి – నవంబర్ 8, 2026 (ఆదివారం)

అయితే ఈ 2026 సంవత్సరంలో వరుసగా 7 లాంగ్ వీకెండ్స్ వచ్చాయి. అంటే వరుసగా 3 రోజులు సెలవులు. శుక్రవారం, శనివారం, ఆదివారం లేదంటే శనివారం, ఆదివారం, సోమవారం ఇలా వరుసగా 3 రోజులు సెలవులు 7 సార్లు రావడం జరిగింది.

Leave a Comment