Telangana Sankranti Holidays 2026: సంక్రాంతి సెలవులు

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఈ Telangana Sankranti Holidays 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరిగే పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

ముఖ్యంగా పల్లెటూర్లలో ముగ్గులు, కోళ్ల పందేలతో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ జనవరి 14, 15, 16 తేదీల్లో రావడం జరిగింది.

ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా దాదాపు 10 రోజులపాటు సెలవులు ఇస్తూ వస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 10వ తేదీ నుండి జనవరి 18వ తేదీ వరకు మొత్తం 9 రోజులపాటు సెలవులను ప్రకటించింది.

పదవ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు

Telangana Sankranti Holidays 2026

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తాజాగా సెలవులను ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుండి జనవరి 16వ తేదీ వరకు మొత్తంగా 7 రోజులను సెలవులుగా ప్రకటించింది.

సెలవు తేదీవారం
జనవరి 10, 2026శనివారం
జనవరి 11, 2026ఆదివారం
జనవరి 12, 2026సోమవారం
జనవరి 13, 2026మంగళవారం
జనవరి 14, 2026బుధవారం (భోగి)
జనవరి 15, 2026గురువారం (సంక్రాంతి)
జనవరి 16, 2026శుక్రవారం (కనుమ)

మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7 రోజులను సెలవులుగా ప్రకటించింది. తిరిగి జనవరి 17, 2026వ తేదీ శనివారం పాఠశాలలు ప్రారంభమవుతాయి.

Leave a Comment