పశుసంవర్ధక శాఖలో 10th Pass ఉద్యోగాలు – Eligibility, Age Limit, Application

పదవ తరగతి పాసైన అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ Lab Attendant Notification ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి విడుదల అయింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 6 ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పోస్టుల వివరాలు చూస్తే

CategoryBC-BBC-ESCSTTotal
G WG WG WG W
Local1 00 11 11 06

ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు డిసెంబర్ 18, 2025 వ తేదీ లోపు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.

Age Limit :

నవంబర్ 30, 2025 వ తేదీ నాటికి 18 సంవత్సరముల నుండి 42 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

Educational Qualification:

పదవ తరగతి పాసైన విద్యార్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

How To Apply:

ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు పదవ తరగతి మార్కు లిస్టు, నాలుగవ తరగతి నుండి పదవ తరగతి వరకు గల స్టడీ సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్, నేటివిటీ సర్టిఫికెట్ అన్నింటిని జిరాక్స్ తీపించుకొని పూర్తి బయోడేటా తో జతపరిచి సంయుక్త సంచాలకులు (పశు సంవర్ధక శాఖ) వారి కార్యాలయము ముత్యాలంపాడు, గవర్నమెంట్ ప్రెస్ దగ్గర, శివాలయము ఎదురు, విజయవాడ నందు డిసెంబర్ 18, 2025 వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు స్పీడు పోస్టు ద్వారా లేదా అభ్యర్థులు స్వయంగా వెళ్లి అందజేయవలెను.

Application Fee:

జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ, విజయవాడ వారి పేరు మీద 200 రూపాయలు డిడి తీసుకొనీ పైన తెలిపిన అన్ని డాక్యుమెంట్స్ తో అటాచ్ చేయాలి.

ఇతర వివరాల కోసం అభ్యర్థులు సంయుక్త సంచాలకులు (పశుసంవర్ధక శాఖ) వారి కార్యాలయము, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా నందు సంప్రదించవలెను.

Salary

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకు 15,000 రూపాయల జీతం వస్తుంది.

ఫోన్ నెంబర్: 9246602731

Leave a Comment