thalliki vandanam Scheme 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులకు భారీ శుభవార్త తెలిపింది. తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకు 15,000 రూపాయలను అందించనున్నారు. ఈ thalliki vandanam Scheme 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలల్లో భాగంగా తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలోని విద్యార్థులకి ఏటా 15 వేల రూపాయలను అందిస్తోంది.
అయితే 2026 సంవత్సరం తల్లికి వందనం పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ తెలిపారు. ఈ సంవత్సరం తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలను జూన్ నెలలో వేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లా, వింజమూరులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తెలపడం జరిగింది.
7వ తరగతి అర్హతతో హై కోర్టులో ఉద్యోగాలు
పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభమైన వెంటనే జూన్ నెలలో తల్లికి వందనం పథకం కింద డబ్బులను జమా చేస్తామని తెలపడం జరిగింది. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఈ డబ్బులను జమ చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో ప్రతినెల 2,750 కోట్ల రూపాయలను పింఛన్ల పంపిణీ కోసం ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఆడబిడ్డలకు దీపం 2.0 పథకం కింద ఏటా మూడు సిలిండర్లను అందజేస్తున్నామని, అలాగే నేతన్నలకు ఏప్రిల్ 01, 2026వ తేదీ నుండి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
ఈ తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయలను విద్యార్థుల తల్లుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. మిగిలిన 2000 రూపాయలను పాఠశాల పాఠశాల మౌలిక ఖర్చులకు ఉపయోగించడం జరుగుతుంది.
ఒకటవ తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్న ప్రైవేట్ మరియు గవర్నమెంట్ విద్యార్థులు ఈ తల్లికి వందనం పథకంకి అర్హులు. అయితే విద్యార్థులు 75% హాజరు కలిగి ఉండాలి. అలాగే విద్యార్థుల తల్లి అకౌంటు ఆధార్ తో లింక్ అయి ఉండాలి.
ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ పథకాల వివరాలు మరియు జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
2 thoughts on “గుడ్ న్యూస్! అకౌంట్లో తల్లికి వందనం 15,000 రూపాయలు. thalliki vandanam Scheme 2026”