AP Aadhar Update 2026: విద్యార్థులకు ముఖ్య గమనిక.

AP Aadhar Update 2026:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూలు మరియు కాలేజీ విద్యార్థులకు ముఖ్య గమనిక. రాష్ట్రంలోని 17 సంవత్సరముల లోపు వయసు కలిగిన విద్యార్థులు ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు కల్పించింది. ఈ AP Aadhar Update 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూలు మరియు కాలేజీ విద్యార్థులు ఆధార్ అప్డేట్ చేయించుకోవడానికి ఇది మంచి అవకాశం. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఉచితంగా ఆధార అప్డేట్ చేయించుకునే విధంగా క్యాంపులను జనవరి 5, 2026వ తేదీ నుండి జనవరి 9, 2026వ తేదీ మధ్య నిర్వహించనుంది.

ఇది విద్యార్థులకు మంచి అవకాశం. సాధారణంగా ఆధార్ సెంటర్ కు వెళ్లి ఆధార్ అప్డేట్ చేసుకోవాలి అంటే డబ్బులు అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఆధార్ సెంటర్లలో కస్టమర్లు కూడా ఎక్కువగా ఉంటారు. లైన్లో నిలబడాలి. ఇటువంటి సమస్యలు ఏమీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది.

AP January Month Holiday’s 2026: జనవరి నెల మొత్తం సెలవులు

ఇంకా ఎవరైనా తమ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోలేదో అటువంటివారు కచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

అందరూ చిన్న వయసులోనే ఆధార్ కార్డును తీసుకుని ఉంటారు. కాలం గడిచే కొద్దీ వారి వయసులో వచ్చిన మార్పులు వారి వేలిముద్రలో మరియు కళ్ళ ఐరిష్ లో మార్పులు వచ్చి ఉంటాయి. కాబట్టి విద్యార్థులు కచ్చితంగా MBU(Mandatory Biometric Update) చేయించుకోవాలి.

అభ్యర్థులు తమ ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకోకపోతే పరీక్షలు, స్కాలర్షిప్లు, ప్రభుత్వ సేవలకు ఆటంకం కలగవచ్చు. ముఖ్యంగా జాతీయస్థాయిలో JEE, NEET వంటి పరీక్షలు రాసే విద్యార్థులకు సమస్యలు ఎదురవుతాయి.

రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్
ఆధార్ అప్డేట్ తేదీలుజనవరి 5, 2026 – జనవరి 9, 2026
ఎక్కడ చేయించుకోవాలితమ దగ్గరలోని స్కూలు లేదా కాలేజీ వద్ద
ఎవరు చేయించుకోవాలిఆధార్ అప్డేట్ చేయించుకొని స్కూలు మరియు కాలేజీ విద్యార్థులు

కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులు అందరూ తమ ఆధార్ ను జనవరి 9, 2026వ తేదీ లోగా తమ దగ్గరలోని స్కూలు లేదా కాలేజీ వద్దకు వెళ్లి ఆధార్ అప్డేట్ చేయించుకోండి.

రాష్ట్రవ్యాప్తంగా 16.51 లక్షల విద్యార్థులు తమ ఆధార్ కార్డును అప్డేట్ చేయించుకోవాల్సి ఉంది.

ఇటువంటి లేటెస్ట్ న్యూస్, జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే క్రింద ఉన్న వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.

WhatsApp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment