AP Annadata Sukhibhava 3rd Payment
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు భారీ శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం 6000 రూపాయలను రైతుల అకౌంట్లో జమా చేయనున్నారు. ఈ AP Annadata Sukhibhava 3rd Payment కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల అకౌంట్లో ప్రతి సంవత్సరం 20 వేల రూపాయలను వేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీలో భాగంగా ఇప్పటికే రెండు విడుతల వారీగా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది.
మొదటి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం 5000 రూపాయలను మరియు కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలను మొత్తంగా 7000 రూపాయలను రైతుల అకౌంట్లో ఆగస్టు 2, 2025వ తేదీన జమ చేయడం జరిగింది.
రెండవ విడత కింద రాష్ట్ర ప్రభుత్వం 5000 రూపాయలను మరియు కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలను మొత్తంగా 7000 రూపాయలను రైతుల అకౌంట్లో నవంబర్ 19, 2025వ తేదీన జమ చేయడం జరిగింది.
మూడవ విడత కింద రాష్ట్ర ప్రభుత్వం 4000 రూపాయలను మరియు కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలను మొత్తంగా 6000 రూపాయలను మార్చి 13, 2026వ తేదీన రైతుల అకౌంట్లో జమ చేయనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గన్నవరం నియోజకవర్గంలో జరిగే సభలో పాల్గొని నిధులను విడుదల చేయనున్నారు. అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అస్సాంలోని గౌహతిలో నిధులను విడుదల చేయనున్నారు.
ఈ సమాచారాన్ని మీ తోటి ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి.
ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ వివరాలు మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |