AP Electricity News 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు శుభవార్త. ట్రూ డౌన్ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను తగ్గించనుంది. ఇప్పటికే యూనిట్ కు 13 పైసలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ AP Electricity News 2026 కి సంబంధించి చూద్దాం.
ట్రూ డౌన్ విధానం ద్వారా 4497.89 కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. విద్యుత్ చార్జీల కొనుగోల్ల ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర శాఖా మంత్రి పార్థసారధి తెలిపారు.
రైతులకు శుభవార్త: 6000 రూపాయలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడ్డామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ చార్జీలను సైతం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
ట్రూ డౌన్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టామని. దీని ద్వారా ప్రజలపై భారం తగ్గుతుందన్నారు. దీనివల్లనే యూనిట్ కు 13 పైసలు తగ్గిందన్నారు. భవిష్యత్తులో ఇంకా విద్యుత్ చార్జీలు తగ్గుతాయని తెలిపారు.
సూర్య ఘర్ యోజన పథకం కింద రాష్ట్రంలోని పేదలకు సోలార్లను అందిస్తామని తెలిపారు. రైతులు సోలార్లను పెట్టుకుంటే ప్రభుత్వం నుండి ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు.
గత ప్రభుత్వం తక్కువ రూపాయలకే విద్యుత్తు సరఫరా చేస్తామన్న సంస్థలను వ్యతిరేకించి అధిక రేట్లకు ఓపెన్ మార్కెట్లో అగ్రిమెంట్ కుదుర్చుకుందని తెలిపారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేలా తమ ప్రభుత్వం చాలా కష్టపడుతోందని, లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేలా ఎంతో కృషి చేశామని తెలిపారు.