దివ్యాంగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం. ఇకనుంచి ఇవి ఉచితం

డిసెంబర్ 3, 2025వ తేదీ బుధవారం దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు 7 వరాలను ప్రకటించారు.

విజయవాడ లోని తుమ్మలపల్లి క్షేత్రంలో జరిగిన దివ్యాంగుల దినోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దివ్యాంగులు అత్యంత ప్రతిభావంతులని, వారికి కాస్త మద్దతిస్తే ఏదైనా సాధిస్తారని తెలిపారు. తాను మొదటిసారి సీఎం అయినప్పుడు పింఛన్ 200 రూపాయలకు పెంచామని, మళ్లీ ఇప్పుడు 6000 రూపాయలకు పెంచామని తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు 7 వరాలు కురిపించారు.

  1. ఉచిత బస్సు ప్రయాణం
  2. స్థానిక సంస్థలు, పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో ఒక్కొక్కరికి నామినేషన్
  3. సబ్సిడీ పథకం పునరుద్ధరణ
  4. క్రీడా కార్యక్రమాల్లో పథకాల వర్తింపు
  5. ప్రభుత్వ హౌసింగ్ పథకంలో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు
  6. బాపట్లలో ప్రస్తుతం ఉన్న పాఠశాల, జూనియర్ కళాశాలతో పాటు వినికిడి లోపం ఉన్నవారికి ప్రత్యేక డిగ్రీ కళాశాల ఏర్పాటు. పాఠశాల, కాలేజీ, హాస్టల్స్ లో చదివే వారికి అదే చోట పింఛన్ పంపిణీ
  7. రాష్ట్రస్థాయిలో అమరావతిలో దివ్యాంగ భవన్ ఏర్పాటు.

ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీల్లో ఉచితంగా ప్రయాణించేందుకు సౌకర్యం కల్పిస్తోంది. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులు ఉచితంగా ఆర్టీసీల్లో ప్రయాణించవచ్చని హామీ ఇచ్చారు.

ఇకనుండి రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్ లో చదివే దివ్యాంగ విద్యార్థులకు అదే చోట పింఛన్ పంపిణీ చేయనున్నారు.

అదేవిధంగా బాపట్లలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయనున్నారు.

అలాగే దివ్యాంగులను శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు.

ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా 7 వరాలను ప్రకటించింది.

Leave a Comment