AP Govt Sankranti Special 2026: ఉద్యోగులకు శుభవార్త

AP Govt Sankranti Special 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు శుభవార్త తెలిపింది. సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికశాఖ 2,653 కోట్ల రూపాయల నిధులను డిఏ, డిఆర్ ఏరియన్స్, కాంట్రాక్టర్ల బిల్లుల కోసం విడుదల చేశారు. ఈ AP Govt Sankranti Special 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఉద్యోగులు, కాంట్రాక్టర్లకి భారీ శుభవార్త తెలిపింది. ఉద్యోగుల పెండింగ్లో ఉన్న డిఏ, డిర్ ఏరియన్స్ కోసం 1110 కోట్ల రూపాయలు విడుదల చేశారు. దీని ద్వారా 2.25 లక్షల మంది ఉద్యోగులు లాభ పొందనున్నారు.

ఏపీ సచివాలయం పేర్లు మార్పు

పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవ్ చెల్లింపులను కూడా విడుదల చేశారు. దీని కోసం 110 కోట్లు విడుదల చేశారు. దీని ద్వారా 55 వేల మంది లబ్ధి పొందనున్నారు.

నీరు-చెట్టు పథకంలో భాగంగా పనిచేసిన కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న 40 కోట్ల రూపాయలను రిలీజ్ చేశారు. దీని ద్వారా 19 వేల మంది కాంట్రాక్టర్లకు మేలు జరగనుంది.

అలాగే ఈఏపీ, నాబార్డ్, సాస్కి, సిఆర్ఐఎఫ్ పనులకు గాను 1243 కోట్ల రూపాయలు విడుదల చేశారు. మొత్తం అన్ని కలుపుకొని సంక్రాంతి సందర్భంగా 2,653 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేశారు. దీని ద్వారా మొత్తం మీద 5.7 లక్షల మంది లబ్ధి పొందారు.

Leave a Comment