AP Helmet Rules 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ ను కఠినంగా పాటిస్తున్నారు. ఇకనుండి ద్విచక్ర వాహనంలో ప్రయాణించే ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రంలో Helmet Rules 2026 ను కఠినంగా పాటిస్తున్నారు.
ఇకనుండి ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు, వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలి. ఇద్దరిలో ఎవరు హెల్మెట్ ధరించకపోయినా భారీ జరిమానా.
రూల్స్ ను అతిక్రమించి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మొదటిసారి 1035 రూపాయలను జరిమానా విధిస్తారు. లేదంటే 3 నెలలు లైసెన్సును రద్దు చేస్తారు.
రెండవసారి అతిక్రమిస్తే 6 నెలలు లైసెన్సును రద్దు చేస్తారు.
మూడవసారి అతిక్రమిస్తే మీ లైసెన్సును పూర్తిగా రద్దు చేస్తారు. కొన్ని సందర్భాల్లో మీ వాహనాన్ని కూడా సీజ్ చేసే అవకాశం ఉంది.
పదవ తరగతి అర్హతతో 22వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు
| మొదటిసారి అతిక్రమిస్తే | ₹1035 ఫైన్ లేదా 3 నెలలు లైసెన్స్ రద్దు |
| రెండవసారి అతిక్రమిస్తే | 6 నెలలు లైసెన్సు రద్దు |
| మూడవసారి అతిక్రమిస్తే | శాశ్వతంగా లైసెన్స్ రద్దు. |
ఈ రూల్స్ ను చూసి వాహనదారులు షాక్ అవుతున్నారు.
ఇంతకుముందు వాహనం నడిపే వ్యక్తి హెల్మెట్ ధరిస్తే సరిపోయేది. అయితే కొత్త రూల్స్ ప్రకారం వెనక కూర్చున్న వ్యక్తి కూడా కచ్చితంగా హెల్మెట్ ధరించాలి. విశాఖపట్నంలో ఈ రూల్స్ ను కఠినంగా ఫాలో అవుతున్నారు. గత రెండు రోజుల్లో వేలాది ఈ చలాన్లు విధించినట్లు పోలీసులు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్న వారిలో దాదాపు సుమారుగా 80% కి పైగా వ్యక్తులు హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారే. అందుచేత సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల్లో వాహనాదారులు హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది.
ఈ రూల్ ను అన్ని రాష్ట్రాలు కఠినంగా అమలు చేయాలని పేర్కొంది. అందుచేత ఏపీ పోలీసులు కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి అనే రూల్ ను అమలు చేస్తున్నారు.
గత సంవత్సరం 2025 సెప్టెంబర్ నుండి 2025 డిసెంబర్ 31 వరకు దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఇక జనవరి 1, 2026 నుండి ఈ చలాన్ లను ప్రారంభించారు.
ఇన్ని రోజులు సీరియస్గా తీసుకొని ప్రజలు, ఇప్పుడు చలాన్లు వేస్తుంటే షాక్ అవుతున్నారు. అయితే ఈ నిబంధనలు అన్నీ కూడా ప్రజల యొక్క భద్రత కోసమే.