7వ తరగతి అర్హతతో ఉద్యోగాలు! AP High Court Recruitment 2026

AP High Court Recruitment 2026

హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతి నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 13 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ AP High Court Recruitment 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఈ AP High Court Recruitment 2026 కోసం అభ్యర్థులు మార్చి 30, 2026వ తేదీ నుండి ఏప్రిల్ 19, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఈ AP High Court Recruitment 2026 ద్వారా

పోస్టు పేరుఖాళీల సంఖ్య
1సెక్షన్ ఆఫీసర్స్5
2సీనియర్ సిస్టం ఆఫీసర్1
3కంప్యూటర్ ఆపరేటర్31
4అసిస్టెంట్ లైబ్రరీయన్ 1
5లైబ్రరీయన్ గ్రేడు – 21
6యు. డి . స్టెనోగ్రాఫర్7
7అసిస్టెంట్78
8ఎగ్జామినర్ 27
9టైపిస్ట్44
10కాపీస్ట్ 34
11డేటా ఎంట్రీ ఆపరేటర్50
12స్టెనోగ్రాఫర్1
13ఆఫీసు సబార్డినేట్20
మొత్తం300

కేటగిరి వైస్ పోస్టులను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

Age Limit:

ఈ AP High Court Recruitment 2026 కు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు జనవరి 01, 2026 వ తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య వయసును కలిగి ఉండాలి.

ఎస్సీ, ఎస్టి, బీసీ మరియు ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

ఫిజికల్లీ హ్యాండీకప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజు రిలాక్సియేషన్ ఉంది.

పదవ తరగతి అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

Educational Qualification:

ఆఫీసు సబార్డినేట్: ఏడవ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలి. (ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ పాస్ అయి ఉండకూడదు. అంతకంటే ఎక్కువ చదివి ఉండకూడదు.)

స్టెనోగ్రాఫర్: ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా లా లో డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే షార్తాండ్(80 w.p.m.) మరియు టైపు రైటింగ్ హైయర్ గ్రేడ్(45 w.p.m.) కలిగి ఉండాలి.

డేటా ఎంట్రీ ఆపరేటర్: కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు ఉన్న డిగ్రీ పాసై ఉండాలి. అలాగే టైపు రైటింగ్ (45 w.p.m)

టైపిస్ట్/కాపీస్ట్: ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. అలాగే టైపు రైటింగ్ (45w.p.m) కలిగి ఉండాలి.

అసిస్టెంట్/ఎగ్జామినర్: ఏదైనా డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు.

యు. డి . స్టేనోగ్రాఫర్: ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. అలానే షార్తాండ్ (120 w.p.m) మరియు టైపు రైటింగ్ (45 w.p.m)

లైబ్రరీయన్ గ్రేడు – 2: ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. అలానే B.Li.Sc. డిగ్రీ చేసి ఉండాలి.

అసిస్టెంట్ లైబ్రేరియన్: లాలో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే B.Li.Sc. చేసి ఉండాలి. అలాగే లైబ్రరీ ఎవిడెన్స్ మెయింటైనింగ్ చేయడానికి కంప్యూటర్ స్కిల్స్ ను కలిగి ఉండాలి. సర్టిఫికెట్ను కలిగి ఉండాలి.

కంప్యూటర్ ఆపరేటర్: కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. టైపు రైటింగ్ (45 w.p.m) కలిగి ఉండాలి.

సీనియర్ సిస్టం ఆఫీసర్: బీటెక్ (CSC/ECE/EEE/IT)/M.Sc.(కంప్యూటర్ సైన్స్) చేసినవారు ఈ పోస్టుల కు అప్లై చేసుకోవచ్చు. అలాగే నెట్వర్కింగ్ మరియు సర్వర్ మెయింటెనెన్స్/అడ్మినిస్ట్రేషన్ లో 5 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగిన సైంటిఫికెట్ కలిగి ఉండాలి.

సెక్షన్ ఆఫీసర్: లాలో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.

Selection Process:

సెక్షన్ ఆఫీసర్:

1) జనరల్ నాలెడ్జ్ (20 మార్కులు)

2) మెంటల్ ఎబిలిటీ (10 మార్కులు)

3) లా (సివిల్ & క్రిమినల్) (50 మార్కులు)

ఆఫీసు సబార్డినేట్:

1) జనరల్ నాలెడ్జ్ (50 మార్కులు)

2) మెంటల్ ఎబిలిటీ (30 మార్కులు)

సీనియర్ సిస్టం ఆఫీసర్/కంప్యూటర్ ఆపరేటర్/అసిస్టెంట్ లైబ్రేరియన్/ లైబ్రేరియన్ గ్రేడు 2/యు. డి. స్టెనోగ్రాఫర్/ అసిస్టెంట్ & ఎగ్జామినర్/ టైపిస్టు/ కాపిస్ట్/ డేటా ఎంట్రీ ఆపరేటర్/స్టెనోగ్రాఫర్:

1) జనరల్ నాలెడ్జ్ (50 మార్కులు)

2) మెంటల్ ఎబిలిటీ (30 మార్కులు)

80 మార్కులకు గాను 90 నిమిషాల పాటు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. కోషన్ పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఉంటుంది.

సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, యు. డి. స్టెనోగ్రాఫర్, స్టెనోగ్రాఫర్, టైపిస్టు, కాపిస్టూ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి స్కిల్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది.

Examination Fee:

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే ఒక్కో పోస్టుకు అభ్యర్థులు 800 రూపాయలను ఎగ్జామినేషన్ ఫీజు కింద చెల్లించాలి.

ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 400 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.

How To Apply:

ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి https://aphc.gov.in లో మార్చి 30, 2026వ తేదీ నుండి ఏప్రిల్ 19, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి.

పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. ఎటువంటి తప్పులు లేకుండా అప్లై చేసుకోండి.

Notification

Official Website: https://aphc.gov.in

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాలు వివరాలు కావాలి అంటే మన వాట్సప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

1 thought on “7వ తరగతి అర్హతతో ఉద్యోగాలు! AP High Court Recruitment 2026”

Leave a Comment