AP Housing for all Scheme: ఉచితంగా ఇళ్ల స్థలాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. సొంత ఇల్లు లేని వారికి AP Housing for all Scheme పేరుమీద అర్హులైన వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు అందజేయనున్నారు.

ఇంటి స్థలం తో పాటు ఇల్లు కట్టుకోవడానికి ప్రధానమంత్రి ఆవాస యోజన (PMAY) పథకంకి కూడా అప్లై చేసుకోండి. ఈ PMAY – G పథకం కింద అర్హులైన వారికి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి 2,50,000 రూపాయలను అందజేయడం జరుగుతుంది.

Eligibility For AP Housing Scheme:

దరఖాస్తు దారులు రేషన్ కార్డు కలిగి ఉండాలి.

ఆధార్ కార్డు ను కలిగి ఉండాలి.

దరకాస్తు దారులు సొంత ఇల్లు లేదా సొంత ఇంటి స్థలం కలిగి ఉండకూడదు.

గతంలో రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇంటి పట్టా వచ్చి ఉండకూడదు.

How To Apply For AP Housing for all:

అర్హులైన వారు సంబంధిత పత్రాలను తీసుకొని గ్రామ వార్డు సచివాలయం లోని విలేజ్ రెవెన్యూ అధికారి లేదా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ను కలిసి అప్లై చేసుకోవాలి.

AP Housing For All Scheme ముఖ్య వివరాలు:

ఈ పథకానికి అర్హులైన వారికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ను అందజేయడం జరుగుతుంది.
మహిళల పేరు మీదే ఇంటి పట్టాను జారీ చేయడం జరుగుతుంది.
ప్రభుత్వం జారీ చేసిన ఇంటి స్థలంలో 2 సంవత్సరాలలోపు ఇంటిని నిర్మించుకోవాలి.
ఇంటి పట్టా జారీ అయినప్పటి నుండి 10 సంవత్సరాల తరువాత పూర్తి హక్కు దారులు అవుతారు. ఆ తరువాత మాత్రమే అవసరాల నిమిత్తం ఎవరికైనా అమ్ముకోవచ్చు.
జీవితకాలంలో ఒకసారి మాత్రమే ఇంటి పట్టా జారీ అవుతుంది.

Leave a Comment