AP Investment Growth
పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోని మొదటి స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన కథనం ప్రకారం పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఈ AP Investment Growth కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
2025 – 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి తొమ్మిది నెలల్లో అంటే 2025 ఏప్రిల్ నెల నుండి 2025 డిసెంబర్ నెల వరకు భారతదేశంలో వచ్చిన పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే 4వ వంతు పెట్టుబడులని ఆకర్షించింది.
పదవ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు.
ఫోర్బ్స్ కథనం మేరకు భారతదేశంలో 100% పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 25.3% పెట్టుబడును ఆకర్షించింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో 13.1% పెట్టుబడులతో ఒడిశా రాష్ట్రం, మూడవ స్థానంలో 12.8% పెట్టుబడులతో మహారాష్ట్ర రాష్ట్రం నిలిచాయి. ఈ మూడు రాష్ట్రాలే 51.2% పెట్టుబడులను ఆకర్షించాయి.
4 వ స్థానంలో 9.5% పెట్టుబడులతో తెలంగాణ రాష్ట్రం, 5 వ స్థానంలో 7.1% పెట్టుబడులతో గుజరాత్ రాష్ట్రం నిలిచాయి.
“FY2026 లో ఏపీ రాష్ట్రానికి 25.3% పెట్టుబడులు వచ్చాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే చూడటానికి ఇలానే ఉంటుంది. పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది.” అని మంత్రి నారా లోకేష్ ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన కథనం నీ ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు.
దేశంలో 2025 ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు ఈ 9 నెలల కాలంలో 26.60 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అయితే గత ఆర్థిక సంవత్సరం 2024 ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన పెట్టుబడులు 11.5% ఎక్కువ.
ఈ 26.60 లక్షల కోట్ల పెట్టుబడుల్లో ఇందన రంగం – 22%, రసాయన పరిశ్రమల రంగం – 21%, మెటల్ ఉత్పత్తులు – 17%, ఐటీ రంగాల్లో – 10% పెట్టుబడులు ఉన్నాయి.
ఇటువంటి లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ మరియు ఉద్యోగ సమాచారం కోసం వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |