AP Koushalam Skill Test: మీకు మెసేజ్ వచ్చిందా. మీ తేదీ ఎప్పుడు

AP Koushalam Skill Test: Date and Timings

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయాల్లో AP Koushalam Skill Test ను నిర్వహిస్తున్నారు. ఎవరైతే AP Koushalam కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ అభ్యర్థులకు డిసెంబర్ 02, 2025 వ తేదీ నుండి డిసెంబర్ 6, 2025 వ తేదీల మధ్య Skill Test ను నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని, ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడి “కౌశలం” అనే పేరుతో నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చనుంది.

దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఇంట్రెస్ట్ ఉన్న నిరుద్యోగులకు ఈ కౌశలంకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు తమ పరిధిలోని సచివాలయాల్లో ల తమ మొబైల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు వారు కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సచివాలయం వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోండి.

Eligibility:

Educational Qualification: పదవ తరగతికి తక్కువ, పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లమా, గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ డప్లమా, పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ AP Koushalam Survey కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

Age Limit: 18 సంవత్సరముల నుండి 50 సంవత్సరముల మధ్య వయసు కలిగిన నిరుద్యోగులు అందరూ ఈ AP Koushalam Survey కి అప్లై చేసుకోవచ్చు.

ఎవరైతే AP Koushalam కు అప్లై చేసుకున్నారో వారికి ఇప్పుడు సచివాలయాల్లో డిసెంబర్ 02, 2025 వ తేదీ నుండి డిసెంబర్ 06, 2025 వ తేదీ మధ్య AP Koushalam Skill Test ను నిర్వహించనున్నారు.

AP Koushalam Skill Test Timings:

AP Koushalam Skill Test ను సచివాలయంలో డిసెంబర్ 2, 2025వ తేదీ నుండి డిసెంబర్ 6, 2025 వ తేదీ మధ్య ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒకరికి, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ఒకరికి మొత్తంగా సచివాలయం పరిధిలో ఇద్దరికీ మాత్రమే రోజుకు ఈ AP Koushalam Skill Test ను నిర్వహించడం జరుగుతుంది.

ఎవరికైతే AP Koushalam Skill Test ఉంటుందో వారికి ముందుగానే SMS మరియు మెయిల్ ద్వారా మెసేజ్ రావడం జరుగుతుంది.

AP Koushalam Skill Test Pattern:

ఈ AP Koushalam Skill Test అనేది మార్నింగ్ సెషన్ అయితే ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్ అయితే మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ఉంటుంది.

అంటే ఈ AP Koushalam Skill Test అనేది 1 గంటసేపు ఉంటుంది. సమాచారం మేరకు ఈ 1 గంట సమయంలో 45 నిమిషాలు మ్యాథమెటిక్స్ కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. మిగిలిన 15 నిమిషాలు కమ్యూనికేషన్ స్కిల్స్ కి సంబంధించి ఉంటుంది.

అయితే సమాచారం మేరకు ప్రస్తుతం డిసెంబర్ 2, 2025 వ తేదీ నుండి డిసెంబర్ 6, 2025 వ తేదీల మధ్య ఒక్కో సచివాలయంలో రోజుకు ఇద్దరు చొప్పున ఈ 5 రోజులలో 10 మందికి మాత్రమే AP Koushalam Skill Test ను నిర్వహించనున్నారు. అయితే మిగిలిన వారికి ఎప్పుడు నిర్వహిస్తారో తెలియాల్సి ఉంది.

8 thoughts on “AP Koushalam Skill Test: మీకు మెసేజ్ వచ్చిందా. మీ తేదీ ఎప్పుడు”

Leave a Comment