రైతులకు శుభవార్త! ₹288 తో ₹30,000 పశు బీమా: AP Pasu Bima

AP Pasu Bima

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశు పోషకులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పశువులకు బీమా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ AP Pasu Bima Scheme 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఈ ఏపీ పశు బీమా ద్వారా గేదలు, ఆవులు, మేలు జాతి ఎద్దులు, దున్నలకు 30,000 రూపాయల బీమా వస్తుంది. నాటు ఎద్దులు, దున్నలకు 15,000 రూపాయల బీమా వస్తుంది. గొర్రెలు మరియు మేకలకు 6,000 రూపాయల బీమా వస్తుంది.

పశువులకు ఏమైనా అయితే ఈ బీమా వర్తించాలి అంటే రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతులు కేవలం 15% ప్రీమియంను చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 80% ప్రీమియంను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలే భరిస్తాయి.

ఇంటర్ అర్హతతో 22వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు

30,000 భీమా ఉన్న వాటికి 1920 రూపాయలను ప్రీమియం చెల్లించాలి. అయితే రైతులు 288 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 1632 రూపాయలను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు భరిస్తాయి.

15,000 రూపాయలు బీమా ఉన్న వాటికి 960 రూపాయలు ప్రీమియం ఉంటుంది. అయితే రైతులు 144 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన ప్రీమియంను ప్రభుత్వం భరిస్తుంది.

6,000 రూపాయలు బీమా ఉన్న వాటికి రైతులు 27 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన డబ్బులను ప్రభుత్వం భరిస్తుంది.

ఈ బీమాకీ రైతులు ఎలా అప్లై చేసుకోవాలి అంటే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 19 నుండి జనవరి 31 తేదీల మధ్య ఉచిత పశు వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఉచిత పశు వైద్య శిబిరాల వద్దకు వెళ్లి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 31. రైతులు అక్కడికి వెళ్లి బీమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేసుకోండి.

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

WhatsApp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment