AP Pension News 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు సూచన. రాష్ట్ర ప్రభుత్వం అనర్హత పెన్షన్లను తొలగించేందుకు యాచిస్తోంది. ఈ AP Pension News 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనర్హత కలిగిన పెన్షన్లను తొలగించే అధికారంను కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఇకపై ఎవరైనా అనర్హత పెన్షన్ పొందుతుంటే వారిపై ఫిర్యాదు చేయవచ్చు.
ఎవరైనా అనర్హత పెన్షన్ పొందుతున్నట్లు కలెక్టర్లకు సమాచారం వస్తే, కలెక్టర్ లు ఆ పెన్షన్ దారునిపై విచారణ జరుపూతారు. ఆ విచారణలో పెన్షన్ దారుడు నిజంగానే అనర్హుడు అని తెలిస్తే ఆ పెన్షన్ను తొలగించడం జరుగుతుంది.
మార్చి నెల పెన్షన్ ఒకరోజు ముందే అందజేత.
పెన్షన్లు తీసుకుంటున్నా వారు అనర్హులు అయితే వారిపై కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అసెంబ్లీలో తెలిపారు. ఆ పెన్షన్ దారుడు నిజంగానే అనర్హుడు అయితే ఆ పెన్షన్ను తొలగించే అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చామని ఆయన తెలిపారు.
ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర జనాభ లో 12.88 శాతం ప్రజలు పెన్షన్ పొందుతున్నారని అన్నారు.
ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ వివరాలు మరియు ఉద్యోగ సమాచారం కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
1 thought on “అనర్హత పెన్షన్లు తొలగింపు! AP Pension News 2026”