AP Sankranti Holidays 2026 in telugu: సంక్రాంతి సెలవులు

AP Sankranti Holidays 2026 in telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సెలవులను ప్రకటించింది. ఈ AP Sankranti Holidays 2026 in telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి.

భోగి, మకర సంక్రాంతి, కనుమ అని మూడు రోజులపాటు ఈ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు.

పల్లెటూర్లు ముగ్గుల పోటీలు, బసవన్నల సందళ్ళు, కోళ్ల పందేలతో కలకలలాడుతూ ఉంటాయి. ఇంత ఘనంగా జరుపుకునే పండుగ కాబట్టి ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు విద్యార్థులకు 10 రోజులపాటు సెలవులను ప్రకటిస్తుంది.

ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు జనవరి 10, 2026 వ తేదీ నుండి జనవరి 18, 2026 వ తేదీ వరకు మొత్తంగా 9 రోజులను సెలవు దినాలుగా ప్రకటించింది.

పదవ తరగతి అర్హతతో 22,000 రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

AP Sankranti Holidays List 2026

జనవరి 10, 2026 – 2nd శనివారం

జనవరి 11, 2026 – ఆదివారం

జనవరి 12, 2026 – సోమవారం

జనవరి 13, 2026 – మంగళవారం (భోగి)

జనవరి 14, 2026 – బుధవారం (మకర సంక్రాంతి)

జనవరి 15, 2026 – గురువారం (కనుమ)

జనవరి 16, 2026 – శుక్రవారం

జనవరి 17, 2026 – శనివారం

జనవరి 18, 2026 – ఆదివారం

మొత్తంగా 9 రోజులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం AP Sankranti Holidays 2026 గా ప్రకటించింది.

జనవరి 19, 2026 (సోమవారం) వ తేదీ నుండి యధావిధిగా పాఠశాలలు నిర్వహించడం జరుగుతుంది.

అయితే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాలేజీలకు సంబంధించి సెలవుల దినాలను ప్రకటించలేదు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా Sankranti Holidays 2026 కి సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవే హాలిడేస్ ను ప్రకటించే అవకాశం ఉంది.

AP Sankranti Holidays 2026 ఎన్ని రోజులు?

ఏపీ ప్రభుత్వం జనవరి 10, 2026 వ తేదీ నుండి జనవరి 18, 2026 వ తేదీ వరకు 9 రోజులు సెలవులు ప్రకటించడం జరిగింది.

AP Sankranti Holidays 2026 ఎప్పటినుండి మొదలవుతాయి?

జనవరి 10, 2026వ తేదీ నుండి సంక్రాంతి సెలవులు మొదలవుతాయి.

ఏపీలో సంక్రాంతి సెలవుల తర్వాత ఏ రోజు స్కూల్స్ ఓపెనింగ్?

జనవరి 19, 2026వ తేదీ (సోమవారం)నుండి స్కూల్స్ ను ఓపెన్ చేయడం జరుగుతుంది.

5 thoughts on “AP Sankranti Holidays 2026 in telugu: సంక్రాంతి సెలవులు”

Leave a Comment