AP Swarna Grama, Ward Sachivalayam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది. మూడంచెల అధికారుల విధానాన్ని తీసుకురానున్నారు. ఈ AP Swarna Grama, Ward Sachivalayam మూడంచెల విధానం కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులు చేయనుంది. జిల్లా, మున్సిపల్, మండల స్థాయిలో మూడంచెల అధికారుల విధానాన్ని తీసుకురానుంది. ఈ మూడంచల అధికారులను ఉద్యోగుల పనితీరులను పరిశీలించడానికి నియమించనున్నారు. ఈ మూడంచెల అధికారుల విధానం ఫిబ్రవరి 15, 2026వ తేదీ నుండి అమలు కానుంది.
10వ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో పాడైపోయిన కంప్యూటర్లు, ప్రింటర్ల ను మార్చనున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 22 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. అలాగే ప్రతి సచివాలయానికి ఇంటర్నెట్ సదుపాయం అందించనున్నారు. ఇందుకోసం ప్రతి నెల ప్రతి కార్యాలయానికి రూ.1000 రూపాయలను ప్రభుత్వం అందజేయనుంది. మార్చి మొదటి వారానికి ఈ సదుపాయాలను కల్పించనున్నారు.
అదనంగా ఉన్న స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న గ్రేడ్ 3 (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) ఉద్యోగాల కింద భర్తీ చేసేందుకు ఆలోచిస్తున్నారు. ఇందుకోసం దేవాదాయ కార్యదర్శి మెమోను విడుదల చేయడం జరిగింది. ఈ విధంగా చేస్తే దేవాదాయ శాఖలో ఉన్న ఖాళీల కొరత తీరుతుందని ఆలోచిస్తున్నారు.
ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ వివరాలు మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |