AP Tenth Results 2026
పదవ తరగతి పబ్లిక్ పరీక్షా పేపర్ల మూల్యాంకనం మొదలయ్యింది. ఈసారి పదవ తరగతి పబ్లిక్ పరీక్షల మార్కులను నమోదు చేయడానికి ఆటోమేషన్ పద్ధతిని తీసుకురావడం జరిగింది. ఈ AP Tenth Results 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16, 2026వ తేదీ నుండి ఏప్రిల్ 2, 2026వ తేదీల మధ్య జరిగాయి. దాదాపు 6 లక్షలకు పైగా విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను రాయడం జరిగింది.
పదవ తరగతి పబ్లిక్ పరీక్ష పేపర్ల మూల్యాంకనం ఏప్రిల్ 6 వ తేదీ నుండి మొదలైంది. అయితే మూల్యాంకనం లో ఈసారి ఆటోమేషన్ పద్ధతి ద్వారా మార్కులను నమోదు చేస్తూ ఉన్నారు. ఈ పద్ధతిలో సాంకేతిక సమస్యలు ఎదురవడంతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి పది గంటల వరకు పేపర్లను దిద్దుతున్నారు.
40 పేపర్లు మూల్యాంకనం చేయాల్సిన ఉపాధ్యాయులు కేవలం 20 పేపర్లు మాత్రమే మూల్యాంకనం చేస్తున్నారు. ఇందు చేత విద్యార్థులు ఫలితాలు లేట్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
విద్యార్థులకు శుభవార్త! ఈ తేదీన తల్లికి వందనం 15,000 రూపాయలు
అయితే అన్ని సుజావుగా జరిగితే ఏప్రిల్ 26, 2026వ తేదీలోగా ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.
పేపర్ల మూల్యాంకనంలో సమస్యలు ఏర్పడితే ఫలితాలు మే నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ సమాచారం మరియు జాబ్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |