Free electricity for AP weavers
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు భారీ శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోనీ చేనేత కార్మికులకు ఉచితంగా విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ Free electricity for AP weavers కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేనేతలందరికీ శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని చేనేతలందరికీ ఏప్రిల్ 01, 2026 వ తేదీ నుండి ఉచితంగా విద్యుత్ ను అందించనున్నారు.
ఏప్రిల్ 01, 2026 వ తేదీ నుండి చేనేతలందరికీ ఉచితంగా కరెంటు పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌలు శాఖామంత్రి సవిత శాసనసభలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మర మగ్గం నేతన్నలకు 500 యూనిట్లు ఉచితంగా కరెంటును అందజేయనున్నారు.
ఏపీ ఇంటర్ హాల్ టికెట్ డౌన్లోడ్
ఈ పథకం ద్వారా మగ్గం నేతన్నలకు సంవత్సరానికి 8,640 రూపాయలు, మర మగ్గం నేతన్నలకు 21,600 రూపాయలు ఆదా అవ్వనున్నాయి.
ఈ పథకం ద్వారా దాదాపు లక్షకు పైగా కుటుంబాలు లాభపడునున్నాయి.
అయితే ఈ చేనేతలకు ఉచిత కరెంటు పథకం ఏప్రిల్ 01, 2026 వ తేదీ నుండి ప్రారంభం కానుంది.