Indradhanassu Scheme 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులకు భారీ శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం ఇంద్రధనస్సు పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ Indradhanassu Scheme 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం నూతన పథకాన్ని తీసుకొచ్చింది. దివ్యాంగులు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రధనస్సు పేరుతో నూతన పథకాన్ని తీసుకొచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు స్త్రీ శక్తి పథకాన్ని ఆగస్టు 15, 2025వ తేదీన ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్త్రీ శక్తి పథకం కేవలం మహిళల కోసం ప్రారంభించడం జరిగినది.
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులను కూడా దృష్టిలో పెట్టుకొని వారికి కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని అందించాలనే ఉద్దేశంతో “ఇంద్రధనస్సు” పేరుతో నూతనంగా పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ సమావేశంలో తెలిపారు.
అయితే ఈ ఇంద్రధనస్సు పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వెల్లడిస్తుంది.
ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ పథకాల వివరాలు మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
1 thought on “దివ్యాంగులకు శుభవార్త! Indradhanassu Scheme 2026”