mission vatsalya Scheme 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని తల్లి లేదా తండ్రి లేని పిల్లలకు శుభవార్త తెలిపింది. mission vatsalya Scheme 2026 కింద అర్హులైన పిల్లల కు నెలకు 4000 రూపాయలను ఇవ్వనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి మిషన్ వాత్సల్య పథకం ద్వారా అర్హులైన పిల్లల అకౌంట్లో నెలకు 4,000 రూపాయలు వేయనున్నారు. ఈ పథకం ద్వారా ఆరు నెలలకు ఒకసారి అర్హులైన వారి అకౌంట్లో 24,000 రూపాయలు వేయడం జరుగుతుంది. సంవత్సరానికి మిషన్ వాత్సల్య పథకం ద్వారా 48,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది.
ఈ మిషన్ వాత్సల్య పథకాన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వాటా కింద అందజేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 60% మరియు రాష్ట్ర ప్రభుత్వం 40% కింద డబ్బులను జమ చేయనున్నారు.
మిషన్ వాత్సల్య పథకం అర్హులు:
- తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న పిల్లలు.
- తల్లిదండ్రులు ఇద్దరూ లేని పిల్లలు.
- ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడే తల్లిదండ్రుల పిల్లలు
- విడాకులు తీసుకున్న దంపతుల పిల్లలు
- యాసిడ్ ఎటాక్ బాధితులు
- పకృతి వైపరీత్యాల్లో తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లలు
ఏఐ ప్రభావం.. కాలేజీల్లో 12 వేల కోర్సులు ఎత్తివేత.
పిల్లల వయసు మార్చి 31, 2026వ తేదీ నాటికి 18 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి.
18 సంవత్సరముల వరకు ప్రభుత్వం పిల్లలకు అండగా ఉంటుంది. ఈ మిషన్ వాత్సల్యం పథకం కింద నెలకు 4000 చొప్పున ఆరు నెలలకు 24,000 రూపాయలు వేయడం జరుగుతుంది. సంవత్సరానికి రెండుసార్లు చొప్పున మొత్తంగా 48,000 రూపాయలు వేయడం జరుగుతుంది.
అనాధ పిల్లలు తిరిగి చదువుకొని మంచి భవిష్యత్తు ప్రారంభించాలని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని ప్రారంభించాయి.
అర్హులైన వారు అంగన్వాడి, CDPO ను సంప్రదించి దరఖాస్తు చేసుకోండి. అప్లికేషన్లను పరిశీలించి లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేస్తారు.