ఏపీ ఎంసెట్ పరీక్ష ఫలితాలు విడుదల తేదీ! AP EAPCET Results Date 2026

AP EAPCET Results Date 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనీ విద్యార్థులకు ముఖ్య గమనిక. ఎంసెట్ ఫలితాలు జూన్ 22, 2026వ తేదీన విడుదల కానున్నాయి. ఈ AP EAPCET Results Date 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి పరీక్షలు మే 12, 13, 14, 15, 18 వ తేదీల్లో, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగానికి సంబంధించిన పరీక్షలు మే 19, 20 వ తేదీల్లో నిర్వహించడం జరిగింది.

ఏఐ ప్రభావం కాలేజీల్లో 12 వేల కోర్సులు ఎత్తివేత

ఏపీ ఎంసెట్ పరీక్ష ఫలితాలను మొదట జూన్ 1, 2026వ తేదీన విడుదల చేయాలని భావించారు. అయితే సప్లమెంటరీ పరీక్ష ల కారణంగా ఫలితాలను వాయిదా వేయడం జరిగింది.

ఈ సంవత్సరం నూతనంగా రెండవ సంవత్సరం విద్యార్థులకు బెటర్మెంట్ అవకాశాన్ని కల్పించడం జరిగింది. అయితే ఎంసెట్ ఫలితాల్లో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉండడం కారణం చేత, బెటర్మెంట్ పరీక్షల ఫలితాలు విడుదల వరకు ఎంసెట్ ఫలితాలను వాయిదా వేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలు జూన్ 18, 2026వ తేదీన విడుదల కావడం జరిగింది.

ఏపీ ఎంసెట్ పరీక్ష ఫలితాలు జూన్ 22, 2026వ తేదీన విడుదల కానున్నాయి. విద్యార్థులు తమ ఫలితాలను అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి https://cets.apsche.ap.gov.in/ లో చెక్ చేసుకోండి.

Official Website: https://cets.apsche.ap.gov.in/

Leave a Comment