ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థుల తల్లిదండ్రులకు భారీ శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా “తల్లికి వందనం” పథకం డబ్బులు జమా తేదీనీ ప్రకటించడం జరిగింది. thalliki vandanam 2026 date కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటవ తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం 15000 రూపాయలను వేస్తూ వస్తోంది. తాజాగా 2026 సంవత్సరానికి సంబంధించి డబ్బులు జమ చేసే తేదీని తెలపడం జరిగింది.
ఒకటవ తరగతి నుండి ఇంటర్ వరకు చదివే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకునేందుకై ప్రతి సంవత్సరం 15 వేల రూపాయలను వేస్తోంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఈ పథకం కింద డబ్బులు జమ చేయడం జరుగుతుంది.
ఈ తల్లికి వందనం పథకం కింద 15 వేల రూపాయలు రావాలి అంటే విద్యార్థుల హాజరు పర్సంటేజ్ 75% గా ఉండాలి.
thalliki vandanam 2026 date
అయితే 2026 సంవత్సరానికి సంబంధించి విద్యార్ధుల తల్లుల అకౌంటులో 15వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జూలై 16, 17, 18 వ తేదీల్లో జమ చేయనుంది.
ఈ జులై 16, 17, 18 తేదీల్లో మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ ను నిర్వహించి, తల్లికి వందనం పథకం రెండవ విడత కింద డబ్బులను జమ చేయనున్నారు.
ఈ తల్లికి వందనం పథకం కింద 13 వేల రూపాయలు తల్లుల అకౌంట్లో పడడం జరుగుతుంది. మిగిలిన 2000 రూపాయలను పాఠశాల ఖర్చులకై నిర్వహించడం జరుగుతుంది.