ఉపాధి హామీ కూలీలకు కీలక అప్డేట్ – ఏవైనా సమస్యలు ఉన్నాయా

జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వేతనం చెల్లించకపోయినా, వసతులు కల్పించకుంటే, ఏవైనా సమస్యలు ఉంటే కూలీలే ఫిర్యాదు చేసుకునే విధంగా ప్రభుత్వం అవకాశం కలిపిస్తోంది.

జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా దేశంలో ఎంతోమందికి ఉపాధి లభిస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలు వలస వెళ్లకుండా ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ఎంతో మేలు చేస్తుంది.

అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధి హామీ పథకం కింద 100 రోజులు పనిని 125 రోజులకు పెంచింది. అలాగే కూలీల వేతనాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఉపాధి హామీ పథకం కింద ₹250 కూలీ నీ 307 రూపాయలకు పెంచింది.

ప్రస్తుతం జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది. ఉపాధి హామీ కూలీలకు వసతులు కల్పించకపోయినా, కూలీలు చేసిన పనులకు వేతనం చెల్లించకపోయినా, జాబ్ కార్డులలో ఏవైనా సమస్యలు ఉంటే కూలీలు ఫిర్యాదు చేసే విధంగా టోల్ ఫ్రీ నెంబర్ 1800 200 1001 ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. కూలీలు సమస్యను ఫిర్యాదు చేసిన వెంటనే అధికారులు ఆ సమస్యపై చర్యలు తీసుకుంటారు.

ఉపాధి హామీ కూలీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే మీ తోటి కూలీలకి ఈ విషయాన్ని తెలియజేయండి.

టోల్ ఫ్రీ నెంబర్: 1800 200 1001

Official Website: https://nregastrep.nic.in/

ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ పథకాల వివరాలు మరియు జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

WhatsApp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment