AP Inter Exam Pattern Change 2026
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముఖ్య గమనిక. ఈ సంవత్సరం ఫిబ్రవరి 23, 2026వ తేదీ నుండి జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్ష పేపర్ల పాటర్న్ మారింది. ఈ AP Inter Exam Pattern Change 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఇంటర్ MPC, Bipc విద్యార్థులకు ముఖ్య గమనిక. ఈ సంవత్సరం నుండి ఇంటర్ పరీక్ష పేపర్ల పాటర్న్ మారింది. ఇంటర్ పబ్లిక్ 6 పరీక్ష పేపర్ల బదులుగా ఈ సంవత్సరం నుండి 5 పరీక్షలనే నిర్వహించనున్నారు.
MPC విద్యార్థులకు మ్యాథ్స్ పేపర్ ఏ, పేపర్ బి నీ 150 మార్కులకు నిర్వహించేవారు. అయితే ఈ 2 పేపర్లను కలిపి ఒకటే పేపర్ గా 100 మార్కులకు నిర్వహించనున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ని ఒక్కో పేపర్ 60 మార్కుల చొప్పున నిర్వహించేవారు. అయితే ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీని ఒక్కో పేపర్ 85 మార్కుల చొప్పున నిర్వహించనున్నారు.

Bipc విద్యార్థులకు బొటని, జువాలజీ సబ్జెక్టులను ఒక్కో పేపర్ 60 మార్కుల చొప్పున నిర్వహించేవారు. అయితే ఇప్పుడు బొటని, జువాలజీ 2 పేపర్లను కలిపి 85 మార్కులకు నిర్వహించనున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులను ఒక్కో సబ్జెక్టుకు 60 మార్కుల చొప్పున పరీక్ష నిర్వహించేవారు. ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులను ఒక్కో సబ్జెక్టుకు 85 మార్కులు చొప్పున ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 23, 2026వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24, 2026వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.
ఇటువంటి లేటెస్ట్ గవర్నమెంట్ న్యూస్ మరియు జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |