ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 9 వ తరగతి విద్యార్థులకు ముఖ్య గమనిక. రాష్ట్ర విద్యాశాఖ 9వ తరగతి విద్యార్థుల స్కూల్ పాటన్ లో కొన్ని మార్పులు చేసింది. ఈ వివరాల గురించి పూర్తిగా సమాచారం చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 9వ తరగతి విద్యార్థులకు మార్చి నెల నుండి 10వ తరగతి సిలబస్‌ను మొదలు పెట్టాలని ఆదేశించింది. పాఠశాల ల్లో 9వ తరగతి విద్యార్థులకు మార్చి నెల నుండి పదవ తరగతి సిలబస్ మొదలుపెట్టనున్నారు.
రాష్ట్రంలో 9వ తరగతి విద్యార్థులకు SA -2 పరీక్షలు మార్చి 12, 2026వ తేదీలోగా పూర్తికానున్నాయి. తర్వాత పదవ తరగతి సిలబస్ మొదలుపెట్టనున్నారు.
ఈరోజు నుండి విద్యార్థులకు ఒంటిపూట బడులు
తొమ్మిదవ తరగతి లోనే విద్యార్థులకు పదవ తరగతి సిలబస్‌లో సబ్జెక్టు వైస్ నాలుగు పాఠాలను పూర్తి చేయనున్నారు. పదవ తరగతి పాఠాలను ఏప్రిల్ 23, 2026వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
ఈ ఏప్రిల్ 23వ తేదీలోగా పదవ తరగతి అభ్యర్థులకు సబ్జెక్టులో నాలుగు పాఠాలను పూర్తి చేయనున్నారు.
ఈ విధానం ద్వారా విద్యార్థులకు పదవ తరగతిలో ఎక్కువ సమయం దొరుకుతుంది. విద్యార్థులకు ప్రిపరేషన్ కు సమయం ఎక్కువగా ఉంటుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో బ్రిడ్జ్ కోర్సును ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి.
ఇటువంటి ప్రభుత్వ వివరాలు మరియు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |