AP 10Th Exams Free Bus
10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఈ AP 10Th Exams Free Bus కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16, 2026వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 6.42 లక్షల మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలను రాయనున్నారు.
పదవ తరగతి పబ్లిక్ పరీక్షల దృష్ట్యా విద్యార్థుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం పరీక్ష రాసే విద్యార్థులు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తోంది.
పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు హాల్ టికెట్‌ను చూపించి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు.
పరీక్ష రోజుల్లో విద్యార్థులను బస్సు పాస్ అడగొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బందికి సూచనలు జారీ చేసింది.
ఈ విషయాన్ని మీతోటి వారికి షేర్ చేయండి.
Note: పరీక్షా సమయాల్లో విద్యార్థులు లిఫ్టు అడిగితే కచ్చితంగా సహాయం చేయండి.
ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ సమాచారం మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
1 thought on “టెన్త్ విద్యార్థులకు శుభవార్త! AP 10Th Exams Free Bus”