తల్లికి వందనాలు డబ్బులు పడలేదా.. వెంటనే ఇలా చేయండి! Thalliki Vandanam Amount Not Created 2026

Thalliki Vandanam Amount Not Created 2026

Thalliki Vandanam Amount Not Created 2026: తల్లికి వందనం పథకం కింద అకౌంట్లో డబ్బులు జమా కాలేదా. అర్హత ఉండి డబ్బులు జమా కానీ లబ్ధిదారులు వెంటనే ఇలా చేయండి.

తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి 15000 రూపాయలను జూలై 22, 2026వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ తల్లికి వందనం పథకం డబ్బులు 24 జూలై 2026వ తేదీ వరకు అకౌంట్లో జమ అయ్యాయి.

అయితే అర్హత ఉండి కూడా డబ్బులు జమ కాని లబ్ధిదారులు వెంటనే ఈ విధంగా చేయండి.

రేషన్ దుకాణాల్లో 70+ సరుకులు

ఆగస్టు 3, 2026వ తేదీలోగా లబ్ధిదారులు తమ గ్రామ వార్డు సచివాలయం వద్దకు వెళ్లి సమస్య ఏంటో తెలుసుకుని గ్రీవెన్స్కు అప్లై చేసుకోండి. ఆగస్టు 3వ తేదీ లోగా అప్లై చేసుకోవాలి.

అప్లై చేసుకున్న అభ్యర్థుల అప్లికేషన్స్ ను ప్రభుత్వం ఆగస్టు 4, 2026వ తేదీ నుండి ఆగస్టు 10, 2026వ తేదీల మధ్య పరిశీలించి, అర్హులు గల వారి లిస్టును తయారుచేస్తుంది.

ఒకటవ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం మరియు ఇప్పుడు (గ్రీవెన్స్) అప్లై పెట్టుకున్న వారి కొత్త అర్హుల కు తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఆగస్టు 30, 2026వ తేదీన జమ కావడం జరుగుతుంది.

గ్రీవెన్స్ పెట్టుకున్న తర్వాత తల్లులు తమ అకౌంట్ కి ఆధార్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. లింకు కాలేదంటే వెంటనే లింక్ చేసుకోండి. అలాగే ఈ కేవైసీ మరియు ఎన్పీసీఐ మ్యాపింగ్ తప్పనిసరిగా చేసుకోండి.

Whatsapp Channel

Leave a Comment