Sanjeevani Digital Health Project
Sanjeevani Digital Health Project: రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి సంజీవని డిజిటల్ హెల్త్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నూతనంగా సంజీవని డిజిటల్ హెల్త్ ప్రాజెక్ట్ పథకాన్ని తీసుకురానుంది. ఈ పథకాన్ని ఆగస్టులో ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఇకనుండి రేషన్ దుకాణాల్లో 70+సరుకులు

ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రజలకు 3257 రకాల జబ్బులకు ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందించనుంది. ఈ సంజీవని డిజిటల్ హెల్త్ ప్రాజెక్ట్ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.
ధనిక, పేద అనే భేద భావం లేకుండా అందరికీ ఈ పథకం వర్తించనుంది. అయితే ఈ పథకాన్ని ఆగస్టు నెలలో అమలు చేయనున్నారు.
అదేవిధంగా ఈ పథకం కింద ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరిక్షలను నిర్వహించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా ప్రజలకు వైద్య పరీక్షలను ఇంటి వద్ద నిర్వహించనున్నారు.
అలాగే ఈ పథకం కింద ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులను అందజేయనున్నారు.
1 thought on “మరో కొత్త పథకం! Sanjeevani Digital Health Project”