AP Mee Mart 2026
AP Mee Mart 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదలను దృష్టిలో పెట్టుకొని “మీ మార్టులను” తీసుకురానుంది. డి మార్టులకు పోటీగా రాష్ట్ర ప్రభుత్వం మీ మార్టులను ప్రారంభించనుంది.
పట్టణాలలో చాలామంది డీ మార్ట్ లను చూసే ఉంటారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీ మార్టులను ప్రారంభించనుంది.
ఢిల్లీ పర్యటనల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మీ మార్టులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఈ మీ మార్టుల ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన సరుకులను తక్కువ ధరలకే అందించనున్నారు. ఈ మీ మార్టుల ద్వారా 70 నుండి 250 మధ్య నిత్యవసర సరుకులను అందించనున్నారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త! శ్రీశైలానికి నీరు
రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతగా 1000 మీ మార్టులను ప్రారంభించనుంది. తొలి విడతగా ఈ మీ మార్టులలో 70 నిత్యవసర సరుకులు అందుబాటులో ఉంటాయి.
పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలలో తొలి విడత కింద మీ మార్పులను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. తర్వాత రాష్ట్రమంతటా వ్యాప్తి చేయనుంది.
అలాగే పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మామూలు బియ్యానికి బదులు స్టీమ్ బియ్యాన్ని పంపిణీ చేయనుంది.
2 thoughts on “రేషన్ షాపుల్లో 70+ సరుకులు: AP Mee Mart 2026”