Srisailam Dam water 2026
Srisailam Dam water 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం డ్యాంకు వరద వస్తోంది.
గత రెండు నెలల నుండి వర్షాకాలం అయినప్పటికీ పెద్ద వర్షాలు ఏమి పడలేదు. వర్షాలు లేకపోవడంతో డ్యాములు ఎండిపోసాగాయి. శ్రీశైలం డాం పరిస్థితి దయనీయ స్థితిలో ఉంది.
శ్రీశైలం డ్యాం సామర్థ్యం 215.807 టీఎంసీలు. అయితే ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ లో 41.279 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ పరిస్థితి చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఎగువన కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇందు చేత జలాశయాల నుండి భారీ మొత్తంలో నీటిని క్రిందకు విడుదల చేశారు.

ఈ వరద నీరు జూరాల ప్రాజెక్టుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో జూరాల క్రాస్ గేట్లు కూడా ఎత్తారు. జూరాల ప్రాజెక్టు నుండి మంగళవారం నాడు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేశారు.
ఈ వరద నీరు శ్రీశైలానికి నేడు అనగా జులై 29, 2026వ తేదీ బుధవారం నాడు చేరుకోనుంది. ఈ విషయం తెలుసుకున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు తుంగభద్ర జలాశయానికి కూడా వరద కొనసాగుతోంది.
1 thought on “తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త! Srisailam Dam water 2026”