ఆగస్టు 7న అకౌంట్లో 25 వేలు! Nethannala Sevalo 2026 Telugu

Nethannala Sevalo 2026 Telugu

Nethannala Sevalo 2026 Telugu: చేనేత కార్మికులను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చేనేత కుటుంబాలకు సంవత్సరానికి 25 వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త తెలిపింది. నేతన్నల సేవలో పథకం కింద చేనేతలను ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోనుంది.

ఈ నేతన్నల సేవలో పథకం ద్వారా లబ్ధిదారులైన కుటుంబాలకు ప్రతి సంవత్సరం 25 వేల రూపాయలను అందించనున్నారు.

సంజీవని పథకం ప్రతి కుటుంబానికి 25 లక్షలు

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నేతన్నల సేవలో పథకాన్ని అమలు చేయనుంది. ఆగస్టు 7, 2026వ తేదీన అర్హులైన నేతన్నల అకౌంట్లో 25 వేల రూపాయలను జమ చేయనున్నారు.

దారిద్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. వయసుతో సంబంధం లేకుండా ఈ పథకం ద్వారా డబ్బులను జమ చేయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 51,952 మంది అర్హులుగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కుటుంబ పెద్ద అకౌంట్లో ఆగస్టు 7వ తేదీన 25వేల రూపాయలను ప్రభుత్వం వెయ్యనుంది.

ఈ పథకం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 129.88 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది.

Whatsapp Channel

Leave a Comment