కేంద్రం నుండి నిధులు తెచ్చిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిధులను తీసుకొచ్చారు.
గిరిజన, గ్రామీణ, కుగ్రామాలైనటువంటి 158 మారుమూల పల్లెలకు రోడ్లతో మెయిన్ స్ట్రీమ్ కు అనుసంధానం కోసం పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వాన్నీ అడగడం జరిగింది.
నారా లోకేష్: రాబోయే 3 సంవత్సరాలకు 3 డీఎస్సీలు
ఈ ప్లాన్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 446 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులతో 347 కిలోమీటర్ల మేర 146 రోడ్లను, 19 వంతెనలను నిర్మించనున్నారు.
రోడ్లను నిర్మించడానికి 422.10 కోట్ల రూపాయలను, నిర్వహణ కోసం 24.47 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. వీటిని నాణ్యముగా నిర్మించాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు.