Thalliki Vandanam 30 August 2026
Thalliki Vandanam 30 August 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లులకి తీపి కబురు తెలిపింది. ఆగస్టు 30, 2026వ తేదీన 13000 రూపాయలను అకౌంట్లో జమ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థి నీ ఆర్థికంగా ఆదుకునేందుకై సంవత్సరానికి13వేల రూపాయలు సహాయం చేస్తోంది. ఈ 13 వేల రూపాయలు తల్లుల అకౌంట్లో పడడం జరుగుతుంది.
టీటీడీ సంచలన నిర్ణయం క్యాలీఫ్లవర్(గోబీ) వంటకాలపై నిషేధం
ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తే, అందులో 2000 రూపాయలు పాఠశాల మౌలిక వసతులకై పాఠశాల అకౌంట్లో వేయడం జరుగుతుంది. మిగిలిన 13వేల రూపాయలను అర్హులైన తల్లుల అకౌంట్లో వేయడం జరుగుతుంది.

ఒకటవ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద 13 వేల రూపాయలను ఆగస్టు 30, 2026వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది.
టెక్నికల్ సమస్యల కారణంగా అర్హత ఉండి కూడా గత నెలలో డబ్బులు అందని వారికి కూడా అదే రోజు ఆగస్టు 30, 2026వ తేదీన అందజేయడం జరుగుతుంది.
కొత్తగా అర్హత పొందే విద్యార్థులు ఆగస్టు 25, 2026 వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళ సంఖ్య 2.78 లక్షలు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు.