ఏపీ విద్యార్థులకు శుభవార్త! AP Smart Kitchens 2026

AP Smart Kitchens 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాఠశాల విద్యార్థులకు శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోనీ పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్స్ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ AP Smart Kitchens 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం పథకం లో విప్లవాత్మక మార్పులు చేపట్టనుంది. రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పౌష్టికాహారంతో పాటు శుభ్రతను పాటించడం కోసం స్మార్ట్ కిచెన్స్ ను ప్రారంభించనున్నారు.

7వ తరగతి అర్హతతో ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు

రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో 155 స్మార్ట్ కిచెన్స్ ను ప్రారంభించనున్నారు. ఒక్కో స్మార్ట్ కిచెన్ ను 55 లక్షల రూపాయలతో నిర్మించనున్నారు. ఈ స్మార్ట్ కిచెన్ల లో పెద్ద వంట గదులతో పాటు, పెద్ద ఫ్రిజ్లు, మంచినీటి కోసం ఆర్ఓ ప్లాంట్ లు ఉంటాయి.

ఈ స్మార్ట్ కిచెన్స్ వలన వంట చేసే సమయంలో ఎటువంటి గాలి దుమ్ము లేకుండా శుభ్రమైన వాతావరణంలో వంట చేయడం జరుగుతుంది.

క్లస్టర్ విధానం:

సమీపంలోని 40 పాఠశాలలను ఒక యూనిట్ గా చేసి, ఈ పాఠశాలలకు కేంద్రీకృతంగా ఒక స్మార్ట్ కిచెన్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ క్లస్టర్ విధానం ద్వారా ఈ స్మార్ట్ కిచెన్ లో వండిన ఆహారాన్ని దీని పరిధిలోని 40 పాఠశాలలకు ఆహారం వేడి తగ్గకముందే అందజేయడం జరుగుతుంది.

ఈ విధానం ద్వారా ఆయా పాఠశాలల వంటగదుల నిర్వహణ భారం తగ్గుతుంది. అదేవిధంగా ప్రతిరోజు విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన ఆహారం అందుతుంది.

ఈ విధానం ద్వారా తొలిత వచ్చే ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 45 వేల పాఠశాలలో మరియు ఇంటర్ కళాశాలల్లో ఈ విధానాన్ని అమలు పరచనున్నారు.

ఇటువంటి ప్రభుత్వ పథకాల వివరాలు మరియు జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment