Talliki Vandanam Scheme 2026 Date
తల్లికి వందనం పథకం కోసం ఎదురుచూస్తున్న తల్లులకు భారీ శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం విడుదల తేదీని విడుదల చేసింది. ఈ Talliki Vandanam Scheme 2026 Date కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
తల్లికి వందనం పథకం ఈసారి చాలా ఆలస్యమైంది. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెలలోనే తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం డబ్బులు విడుదల తేదీని విడుదల చేయడం జరిగింది.
ఒకటవ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద సంవత్సరానికి 15000 రూపాయలను వేస్తూ వస్తుంది. తల్లుల ఖాతాల్లో 13 వేల రూపాయలు జమ కావడం జరుగుతుంది. మిగిలిన 2000 రూపాయలను పాఠశాల మౌలిక వసతుల కోసం పాఠశాల అకౌంట్లో వేయడం జరుగుతుంది.
మిషన్ వాత్సల్య పథకం: అనాధ పిల్లల అకౌంట్లో 4,000 రూపాయలు
తల్లికి వందనం పథకం డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం జులై 22, 2026వ తేదీన విడుదల చేయనుంది.
ఇంటర్ మొదటి సంవత్సరం చేరే విద్యార్థులకు ఆగస్టు 30వ తేదీలోగా తల్లికి వందనం పథకం కింద డబ్బులను జమ చేయడం జరుగుతుంది.
ఈ తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 67.47 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 10,120.78 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. ఈ తల్లికి వందనం పథకం ద్వారా 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో జులై 22వ తేదీన డబ్బులు జమా కానున్నాయి.
అయితే తల్లిదండ్రులు ఒకసారి సచివాలయం ఉద్యోగిని కలిసి తమ పేరు తల్లికి వందనం పథకం లిస్టులో ఉందో లేదో తెలుసుకోండి.
అలానే తల్లి అకౌంటు యాక్టివ్ గా గా ఉందో లేదో చూసుకోండి.
1 thought on “ఈ తేదీన అకౌంట్లో 15 వేలు! Talliki Vandanam Scheme 2026 Date”