Corona Cases in AP 2026
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ కేసులు మరలా పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్నడంతో వైద్యశాఖ ఒకసారిగా అప్రమత్తమయ్యింది. Corona Cases in AP 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. జూన్ 26వ తేదీన కడప జిల్లాలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. అనంతరం జులై 1 నుండి జూలై 16వ తేదీ మధ్య 11 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఏపీ రాష్ట్రంలో 12 కరోనా కేసులు నమోదయ్యాయి.
అమ్మ ఒడి తేదీ ఫిక్స్.. అకౌంట్లో 15000 రూపాయలు
ఈ కరోనా కేసులను జిల్లాల వారీగా పరిశీలిస్తే కడప జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నం మరియు కాకినాడ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి.
ఈ 12 మంది కరోనా పేషంట్లలో నలుగురు ఇప్పటికే మరణించారు. కడప జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు మరియు కాకినాడ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మరణించడం జరిగింది. అయితే వీరికి ఇదివరకే అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా వల్లే మరణించారని చెప్పలేమని తెలిపారు.
ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అధికారులు తెలిపారు. కరోనా కేసులన్నీ వేరు వేరు ప్రదేశాల్లో నమోదయ్యాయని, ఎక్కడ సామూహిక వ్యాప్తి కనిపించలేదని తెలిపారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలని తెలిపారు.
దేశవ్యాప్తంగా 399 కేసులు నమోదయ్యాయి.
2 thoughts on “కరోనా మహమ్మారి.. మళ్లీ పెరుగుతున్న కేసులు! Corona Cases in AP 2026”