విక్రమ్ 1 రాకెట్.. కొత్త చరిత్ర! Skyroot Vikram-1 rocket

Skyroot Vikram-1 rocket

భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించనున్నారు. హైదరాబాదుకు చెందిన ప్రముఖ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్ – 1 రాకెట్ను సక్సెస్ఫుల్గా లాంచ్ చేయనున్నారు. ఈ Skyroot Vikram-1 rocket కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఇది భారత్లో ప్రైవేట్ కంపెనీ తయారుచేసిన మొదటి ఆర్బిటాల్ రాకెట్ లాంచ్ కావడం విశేషం. హైదరాబాదు కి చెందిన ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ఈ విజయంతో భారత స్పేస్ రంగంలో కొత్త చరిత్ర రాయనున్నారు.

ఈ ప్రయోగాన్ని శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ లో జులై 18, 2026వ తేదీన ఉదయం 11:30 నిమిషాలకు రాకెట్ ప్రయోగించడం జరుగుతుంది (అయితే సమయం మార్చడం జరిగింది). ఈ ప్రయోగానికి “మిషన్ ఆగమన్” అని పేరు పెట్టారు.

పెరుగుతున్న కరోనా కేసులు.. ఏపీలో ఎన్నంటే?

భారతదేశ అంతరిక్ష పరిశోధనల పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరు మీద స్కైరూట్ కంపెనీ ఈ రాకెట్ కు విక్రమ్ అని పేరు పెట్టింది.

విక్రమ్ 1 పూర్తిగా కార్బన్ కాంపోజిట్ పదార్థాలతో రూపొందించిన ఆధునిక ప్రయోగ వాహనం. రాకెట్ 1 లో స్కైరూట్ సంస్థ అభివృద్ధి చేసిన త్రీడీ ప్రింటెడ్ రాకెట్ ఇంజన్లు, అధిక సామర్థ్యం గల సాలిడ్ రాకెట్ మోటార్లను ఉపయోగించారూ.

విక్రమ్ 1 ఎత్తు సుమారు 20 మీటర్లు. ఇది 450 మీటర్ల ఎత్తువరకు 350 కేజీల బరువును మోసుకెళ్లగలదు.

భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను సులభంగా పంపడానికి విక్రమ్ 1 ప్రయోగం చాలా ఉపయోగపడుతుంది.

Leave a Comment