swasthya karyakram 2
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా వైద్య పరీక్షలను నిర్వహించనుంది. ఈ bal swasthya karyakram 2 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బాల స్వాస్త్య కార్యక్రమం – 2 ద్వారా 2026 – 2027 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని 62.65 లక్షల మంది విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు.
ఈ బాల స్వాస్త్య కార్యక్రమం – 2 ద్వారా 36 రకాల హెల్త్ టెస్టులను చేయనున్నట్లు మంత్రి సత్య కుమార్ తెలిపారు. ఇందుకోసం రంగం సిద్ధమవుతోంది.
పిల్లల అనారోగ్య పై దృష్టి పెట్టి, ఆరోగ్య సమస్యలను ముందుగా గుర్తించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డయాబెటిస్, బిపి, ఊబకాయం వంటి వ్యాధులను ఇనిషియల్ స్టేజ్ లోనే గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కేంద్ర మరియు రాష్ట్ర భాగస్వామ్యాలతో నడుస్తున్న బాల స్వాస్త్య కార్యక్రమం – 2 ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో 20.95 లక్ష్యాల మంది పిల్లలకు, స్కూల్లలో 41.70 లక్షల మంది విద్యార్థులకు మొత్తంగా ఈ కార్యక్రమం ద్వారా 62.65 లక్షల మంది విద్యార్థులకు 36 రకాల టెస్టులను నిర్వహించనున్నారు.
ఈ బాల స్వాస్త్య కార్యక్రమం – 2 ద్వారా పిల్లలకు ఉచితంగానే టెస్టులను నిర్వహించనున్నారు. స్కూల్ల వద్దకే వైద్య బృందాలు వెళ్లి విద్యార్థులను పరీక్షించనున్నారు.
పిల్లలకు వైద్య పరీక్షల్లో ఏవైనా సమస్యలు తలెత్తుతే ప్రభుత్వమే వారికి ఉన్నత వైద్య సహాయాన్ని అందిస్తుంది.
ఈ నిర్ణయం పేద విద్యార్థులకు ఎంతో మేలు చేయనుంది.
1 thought on “విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు..! swasthya karyakram 2”