Steam Rice In AP
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళగిరి అక్షయపాత్ర వంటశాలో భోజనాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు మంచి పౌష్టికమైన స్టీమ్ రైస్ ను అందజేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విద్యార్థులకు మంచి నాణ్యమైన ఆహారం అందించేందుకే కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఏపీ విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు
కొత్త బియ్యం కావడం వల్లే అన్నం ముద్ద లాగా అవుతోందని తెలిపారు. కొంచెం ఏజుడు రైసు వాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని తెలిపారు.
త్వరలోనే కేంద్ర ప్రభుత్వ సహకారంతో వేడివేడి స్టీమ్ రైస్ ను అందజేయనున్నట్లు తెలిపారు. స్టీమ్ బియ్యం పంపిణీ వల్ల విద్యార్థులు పౌష్టికంగా ఆరోగ్యంగా ఉంటారు.
ముందుగా పైలెట్ ప్రాజెక్టు కింద ఒక జిల్లాకి స్టీమ్ రైస్ పంపిణీ చేయడం జరుగుతుంది. అక్కడ వచ్చిన రెస్పాన్స్ ను బట్టి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు.
ఇంటి నుండి విద్యార్థులు ఎవరు క్యారేజ్ తెచ్చుకోకుండా చేయడమే తమ లక్ష్యం అని తెలిపారు.
2 thoughts on “స్కూల్స్ లో స్టీమ్ రైస్! Steam Rice In AP”