పెన్షన్ దారులకు శుభవార్త! AP August Pension 2026

AP August Pension 2026

AP August Pension 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పింఛనుదారులకు శుభవార్త తెలిపింది. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా.. ఉత్తరాంధ్ర ప్రజలకు ఒకరోజు ముందుగానే పింఛనును పంపిణీ చేయనున్నారు.

రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ను ఆగస్టు 1, 2026వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరుకానున్నారు. ప్రారంభోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

గిరిజన సంస్కృతి, హస్తకళలను గుర్తుచేసేలా ప్రధాని స్వాగత కార్యక్రమం ఉండాలని, ప్రజలు, యువత కార్యక్రమంను పండుగల జరపాలని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

స్కూల్స్ లో స్టీమ్ రైస్

ఈ కార్యక్రమంలో భారీగా ప్రజలు పాల్గొనే అవకాశం ఉంది. ఇందు చేత పెన్షన్ దారులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఒకరోజు ముందుగానే ప్రభుత్వం పెన్షన్ అందించనుంది.

ఉత్తరాంధ్ర 6 జిల్లాల్లో ఆగస్టు నెల పెన్షన్ ను ఒకరోజు ముందుగానే అంటే జులై 31, 2026వ తేదీన అందజేయనున్నారు.

రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో పెన్షన్ ను యధావిధిగా ఆగస్టు 01, 2026 వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అందజేయనుంది. సచివాలయం ఉద్యోగులు పెన్షన్ను అందజేస్తారు. ఉదయం 7 గంటల నుండి లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి సచివాలయం ఉద్యోగులు పెన్షన్ను అందజేయడం జరుగుతుంది.

Whatsapp Channel