తల్లికి వందనం.. తల్లిదండ్రులకు కీలక సూచన! AP Thalliki Vandanam 2026 July 22

AP Thalliki Vandanam 2026 July 22

AP Thalliki Vandanam 2026 July 22: తల్లికి వందనం పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూలై 24, 2026వ తేదీ వరకు 13,000 రూపాయలను అకౌంట్లో వెయ్యనుంది. అయితే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలియజేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటవ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 15000 రూపాయలను అందజేస్తోంది. గతంలో అమ్మఒడిగా పిలిచే పథకాన్ని ఇప్పుడు తల్లికి వందనంగా కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తోంది.

ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల అకౌంట్లో 13 వేల రూపాయలు జమ కావడం జరుగుతుంది. మిగిలిన 2000 రూపాయలను పాఠశాల అవసరాల కోసం పాఠశాల అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఈ డబ్బులు జులై 22, 2026వ తేదీ నుండి జూలై 24, 2026వ తేదీ వరకు అకౌంట్లో పడనున్నాయి.

స్కూల్స్ లో స్టీమ్ రైస్

ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఈ పథకం వర్తించనుంది.

అయితే ముఖ్య గమనిక ఏమిటంటే ఈ సమయంలో సైబర్ నేరగాళ్లు వేచి ఉంటారు. సైబర్ నేరగాళ్లు తల్లికి వందనం పథకం పేరు మీద మోసపూరిత లింకులను మొబైల్ కు పంపించే అవకాశం ఉంది. అయితే వీటిని ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని అధికారులు చెబుతున్నారు. ఏవైనా సందేహాలు ఉంటే సచివాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.

Whatsapp Channel

1 thought on “తల్లికి వందనం.. తల్లిదండ్రులకు కీలక సూచన! AP Thalliki Vandanam 2026 July 22”

Leave a Comment