AP Schools Bandh July 24, 2026
AP Schools Bandh July 24, 2026: నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి దేశ రాజధాని అయిన ఢిల్లీలో దుమారం రేగుతోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు భారీ సంఖ్యలో నిరసనలు చేపట్టారు. పేపర్ లీకేజీ ఉదాంతం తీవ్ర దుమారం లేపుతోంది.
గత రెండు రోజులుగా దేశ రాజధాని అయిన ఢిల్లీ విద్యార్థుల నిరసనలతో అట్టడుగుతోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ తెలియజేస్తున్నారు.
నీట్ పరీక్ష రద్దు చేయాలి. NTA ను రద్దు చేయాలి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ప్లకార్డులతో విద్యార్థులు ఢిల్లీ వీధుల్లో హోరెత్తారు.
తల్లికి వందనం 13000.. తల్లిదండ్రులకు కీలక సూచన
కాక్రోచ్ జనతా పార్టీ(CJP) మరియు ఇతర ఆందోళనకారులు విద్యాశాఖ మంత్రి నివాస స్థలం, జంతర్ మంతర్ వద్ద భారీ స్థాయిలో ధర్నాలు చేపట్టారు. పార్లమెంటును ముట్టడించేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు.
ప్రధాని నివాస స్థలం వద్ద రాహుల్ గాంధీ మంగళవారం నిరసన చేపట్టారు. తీవ్ర ఉధృతి దాల్చడంతో పోలీసులు రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటికి విడుదల చేశారు.
లక్షలాది మంది యువత జీవితాలను సమస్యల్లోకి నెట్టిన నీట్ పేపర్ లీకేజీ సంస్కృతిని అరికట్టాలని ప్రధాన విద్యార్థి, యువజన సంఘాలు ధ్వజమెత్తాయి. ఈ క్రమంలో SFI, PDSU, AISA, NSUI, DYFI, AIYF వంటి ప్రధాన సంఘాల రాష్ట్ర కమిటీలు పోరాటానికి సిద్ధమయ్యాయి.
ఈ సందర్భంగా అయా సంఘాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జూలై 24, 2026 వ తేదీనీ రాష్ట్ర బంద్ గా ప్రకటించారు. ఈ బంద్ లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.